వీరభద్రుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
రాయచోటి టౌన్: రాయచోటి భద్రకాళి సమేత వీరభద్రస్వామి(రాచరాయుడు) బ్రహ్మోత్సవాలు ఆదివారం వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారు జామున వేదపండితుడు ప్రణవానందగిరి ( నర్నా వెంకట భాస్కర సిద్ధాంతి) తన శిష్యులతో యాగశాల, తర్వాత మహాగణపతి పూజ, గోపూజ నిర్వహించి ఆలయ ప్రదక్షిణ చేశారు. స్వామి, అమ్మవార్లకు కంకణధారణ పట్టువస్త్రాలు సమర్పించారు. ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో కంకణధార నిర్వహించారు. అనంతరం గుడిలో ఉన్న బావి నుంచి గంగను తీసుకొచ్చారు. కలశాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత వీరశైవుల విన్యాసాలతో స్వామి వారి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. రాత్రి పాతరాయచోటిలోని అగస్తేశ్వర స్వామి ఆలయం నుంచి మట్టి సేకరణతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ ఉత్సవాలు తిలకించేందుకు కర్నాటక నుంచి వేలాదిగా తరలి వచ్చారు. అలాగే రాత్రి స్వామి వారి త్రిశూల మెరవణి, అగ్నిప్రతిష్టాపన, వాస్తు పర్మగ్నీకరణ చేశారు.
వైభవంగా
ధ్వజారోహణ కార్యక్రమం
వీరభద్రుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Comments
Please login to add a commentAdd a comment