దేవుడా.. ఏమిటయ్యా ఈ ఘోరం.!
కురబలకోట : భార్యా భర్తలు ఒకరి తర్వాత ఒకరు కన్నుమూశారు. అంతేకాదు భార్య చనిపోయిన విషయం భర్తకు తెలీదు. భర్త విషయం భార్యకు తెలీదు. తల్లిదండ్రులు దూరమవడంతో వీరి ఇద్దరి కుమార్తెలను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. మాటలకందని విషాదం అలుముకుంది. కన్నీరుకే కన్నీరు తెప్పించే విషాద సంఘటన ఇది. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని అడవిపల్లెకు చెందిన ఎ. మాధవరెడ్డి (50) బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. భార్య శారద (39). వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇటీవల శారద తండ్రి చంద్రశేఖర్‌రెడ్డి అస్వస్థతకు గురి కావడంతో అతన్ని చూసేందుకు బెంగళూరు నుంచి వచ్చారు. తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని పలకరించి శనివారం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. కారులో వస్తుండగా వాల్మీకిపురం సమీపంలోని విఠలం వద్ద ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ గాయపడ్డారు. భార్య ఎ. శారద తీవ్రంగా గాయపడి శనివారం సాయంత్రం అక్కడికక్కడే మృతి చెందారు. భర్త ఎ. మాధవరెడ్డి గాయపడి బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడంతో వీరి స్వగ్రామమైన మండలంలోని అడవిపల్లె శోక సంద్రమైంది. రెండు రోజుల క్రితం భార్య శారదమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. ఆ విషాదం నుండి తేరుకోకమునుపే మంగళవారం అదే ఊరిలో భర్త అంత్యక్రియలు జరిపారు. అమ్మా..నాన్న ఇక మాకెవరు దిక్కు అంటూ వీరి కుమార్తెలు రోదించడం చూపరులను కలచి వేసింది. వీరిని చూసిన బంధుమిత్రులు వేదన చెందారు. ఇంటికి దీపంగా కంటికి రూపంగా ఉండాల్సిన తల్లిదండ్రులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో అడవిపల్లె తల్లడిల్లి పోయింది. వీరి కుమార్తెలను, రక్త సంబంధీకులను ఓదార్చడం ఎవరిరతం కాలేదు. భార్య సమాధి పక్కనే భర్త అంత్యక్రియలు నిర్వహించారు.
భార్యా భర్తలు ఒకరి తర్వాత ఒకరు మృతి
అడవిపల్లెలో అంతులేని విషాదం
దేవుడా.. ఏమిటయ్యా ఈ ఘోరం.!
దేవుడా.. ఏమిటయ్యా ఈ ఘోరం.!
Comments
Please login to add a commentAdd a comment