బోరు విషయమై వ్యక్తిపై దాడి
మదనపల్లె : బోరు విషయమై చెలరేగిన వివాదం కారణంగా ఓ వ్యక్తిపై దాడి చేసిన సంఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. కొత్తవారిపల్లి పంచాయతీ గాజులవారిపల్లెకు చెందిన చంద్రయ్య(56), అతని తమ్ముడు చిన్న రెడ్డప్పలకు ఉమ్మడిగా బోరుబావి ఉంది. ఇటీవల బోరు చెడిపోవడంతో చిన్న రెడ్డప్ప కొంత నగదు వెచ్చించి మరమ్మతు చేయించాడు. చంద్రయ్య వాటాకు సంబంధించిన నగదు చెల్లించకపోవడంతో, ఈ విషయమై చిన్న రెడ్డప్ప చంద్రయ్యను నిలదీశాడు. ఇరువురి మధ్య వాగ్వాదం జరుగుతుండగా, చిన్న రెడ్డప్ప కుమారుడు గంగాధర్ అక్కడికి చేరుకుని ఇద్దరు కలిసి చంద్రయ్యపై కరల్రతో దాడి చేశారు. దాడిలో చంద్రయ్య తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
గాలివీడు : పట్టణంలో భిక్షాటన చేసుకునే గుర్తు తెలియని వ్యక్తి కడప రిమ్స్‌లో మృతి చెందాడని ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. గత ముప్ఫై సంవత్సరాలుగా గాలివీడు పట్టణం గేటు పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుంటూ మతిస్థిమితం లేక వీధుల్లో తిరుగుతుండేవాడన్నారు. అనారోగ్యంతో రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే గాలివీడు ఎస్‌ఐ 9121100556 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పంట పొలాలపై
అడవి పందుల దాడి
పుల్లంపేట : మండలంలోని అనంతంపల్లి పంచాయతీకి చెందిన తిప్పన ప్రభాకర్ రెడ్డి అనే రైతు అరటి పంటను సోమవారం రాత్రి అడవి పందులు ధ్వంసం చేశాయి. పంట చేతికందే సమయంలో సుమారు 50 అరటి చెట్లను అడవి పందులు ధ్వంసం చేశాయని బాధిత రైతు వాపోయాడు. ఫారెస్టు అధికారులు స్పందించి అడవి పందులు పంట పొలాల్లోకి రాకుండా చూడాలని, అలాగే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం మంజూరు చేయాలని రైతు ప్రభాకర్ రెడ్డి కోరుతున్నాడు.
మహిళ ఆత్మహత్యాయత్నం
రామసముద్రం : కుటుంబ కలహాల కారణంగా భర్తతో గొడవపడి వివాహిత విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం రామసముద్రంలో జరిగింది. ఎస్‌ఐ రవికుమార్ కథనం మేరకు.. రామసముద్రం గాజులనగర్‌కు చెందిన కళాకారుడు తిరుమలేష్ తన భార్య లక్ష్మీదేవి(32)తో ఆర్థిక లావాదేవీల విషయమై గొడవ పడి చేయి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లో ఉన్న విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబీకులు వెంటనే బాధితురాలిని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైద్యుల సిఫార్సు మేరకు తిరుపతి రుయాకు తీసుకెళ్లారు.
బోరు విషయమై వ్యక్తిపై దాడి
బోరు విషయమై వ్యక్తిపై దాడి
Comments
Please login to add a commentAdd a comment