
ధర లభిస్తుందనే ఆశతోనే..
టమాట సాగు జూదంగా మారింది. ధరలు నిలకడగా లేకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. క్యారెట్, బీట్‌రూట్, వేరుశెనగ సాగు చేసి ఇప్పుడు టమాట పంట సాగు చేపట్టాను. ఒకటిన్నర ఎకరంలో దుక్కులు దున్ని, టమాట నారు నాటేందుకు ఇప్పటికే రూ.80 వేలు ఖర్చయ్యింది. దిగుబడి వచ్చే ముందు వరకు రూ.3 లక్షలు ఖర్చవుతుంది. ఆ సమయానికి ధరలు ఉంటాయనే ఆశతో పంట సాగు చేస్తున్నా. ధర లభించకపోతే నష్టాలు తప్పవు.
– శివారెడ్డి, టమాట రైతు, పోతుపేట
వారం తర్వాత డిమాండ్
టమాట సాగు చేసేందుకు మొక్కలకు ఈ నెల రెండో వారం నుంచి డిమాండ్ ఉంటుంది. మే నెలలో దిగబడులు వచ్చేలా రైతులు పంట సాగు చేస్తారు. దీంతో ఏప్రిల్ 10వ తేదీ వరకు మొక్కల కోసం రైతులు నర్సరీల వద్ద క్యూ కడతారు. ఒక్కో మొక్కను 50 నుంచి 70 పైసలకు విక్రయిస్తాం. ఎకరాకు 7 నుంచి 10 వేల మొక్కలు అవసరమవుతాయి. రైతులు పంటను సాగుచేసే సమయానికి డిమాండ్‌కు తగ్గ నారును సిద్ధం చేసి ఉంచుతాం.
– పి.నాగరాజు,
నర్సరీ నిర్వహకుడు, అంగళ్లు

ధర లభిస్తుందనే ఆశతోనే..
Comments
Please login to add a commentAdd a comment