ఎండలు మండుతున్నాయి.. రాబోయే రెండు నెలల్లో 44 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. భూగర్భ జలాలు అడుగంటిన పక్షంలో జలాశయాల నీటితోనే దాహార్తి తీర్చుకునే పరిస్థితి. కానీ ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రూ.100 కోట్ | - | Sakshi
Sakshi News home page

ఎండలు మండుతున్నాయి.. రాబోయే రెండు నెలల్లో 44 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. భూగర్భ జలాలు అడుగంటిన పక్షంలో జలాశయాల నీటితోనే దాహార్తి తీర్చుకునే పరిస్థితి. కానీ ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రూ.100 కోట్

Published Thu, Mar 6 2025 12:08 AM | Last Updated on Thu, Mar 6 2025 12:08 AM

ఎండలు

ఎండలు మండుతున్నాయి.. రాబోయే రెండు నెలల్లో 44 డిగ్రీలకు

నాడు వైఎస్సార్‌ చొరవతో..

ఈ పరిస్థితులు తెలుసుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గాలివీడు సమీపంలో వెలిగల్లు ప్రాజెక్టు పూర్తి చేయించారు. అక్కడి నుంచి 40 కిలోమీటర్ల మేర పైపులైన్‌ వేయించి పట్టణ ప్రజల దాహార్తి తీర్చారు. నేటికీ రాయచోటి ప్రజలు తాగుతున్న నీరు, వినియోగిస్తున్న ప్రతి బొట్టులోనూ వైఎస్సార్‌ కృషి కనిపిస్తుంది. అనంతరం రాయచోటి పట్టణం జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందడంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అప్పటి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఆనాటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రజల దాహార్తి తీర్చేందుకు వెలిగల్లు జలాశయం నుంచి రెండో పైపులైన్‌ నిర్మాణం కోసం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయించారు. 60 శాతం మేర పనులు పూర్తి చేశారు. అనంతరం కూటమి ప్రభుత్వం ఆ పనులు నిలిపివేసింది. రాయచోటి వాసుల దాహార్తి తీర్చే అవకాశం లేకుండాపోయింది. జనాభాకు అవసరమైన నీరందడం లేదు. దీనికి తోడు వెలిగల్లు నుంచి పట్టణానికి రెండో పైపులైన్‌ నిర్మాణంలో భాగంగా గాలివీడు–మదనపల్లి రింగ్‌రోడ్డు సమీపంలో ఏర్పాటుచేస్తున్న ట్యాంకు పనులు, దిగువ అబ్బవరం సమీపంలో నిర్మిస్తున్న భూ ఉపరితల ట్యాంక్‌ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. కొత్తపల్లి ప్రాంతానికి తాగునీరందించే పాత పురపాలక సంఘం ప్రాంతంలోని ట్యాంకు కూల్చారే తప్ప కొత్తది నిర్మించలేదు.

రాయచోటి : రాయచోటి పట్టణ పరిధి విస్తరించడంతో జనాభా 1.10 లక్షలకు చేరింది. 206 వీధులు ఉండగా.. సుమారు 32,355 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీరికి ప్రస్తుతం 114 నీటి బోర్లు, 53 చేతిపంపుల ద్వారా అరకొరగా నీరు అందుతోంది. ఇవి చాలకపోవడంతో ప్రస్తుతం పట్టణానికి ప్రధాన ఆయువు వెలిగల్లు జలాశయం ద్వారా 40 కిలోమీటర్ల దూరంలోని రాయచోటి ప్రజలకు రోజూ పైపులైన్ల ద్వారా పట్టణ పురపాలక సంఘం నీటిని సరఫరా చేస్తోంది. సాధారణంగా రోజుకు 15 మిలియన్‌ లీటర్ల నీరు అవసరం ఉండగా, కేవలం 9 మిలియన్‌ లీటర్ల నీరు వెలిగల్లు నుంచి అందుతోంది. మిలియన్‌ లీటర్ల నీటిని బోర్లు, చేతి పంపుల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇంకా ఐదు మిలియన్ల లీటర్ల నీటి అవసరం ఉంది.

గత పరిస్థితి తలెత్తితే..

రాయచోటి పట్టణం దినదినాభివృద్ధి చెంది అన్నమయ్య జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందింది. అందుకు అనుగుణంగా పట్టణంలో ప్రతి ఒక్కరికీ కనీసం 40 లీటర్ల నీటిని అందించే దిశగా పురపాలక అధికారులు ప్రణాళికలు రూపొందించడం లేదనే విమర్శలున్నాయి. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావం రాయచోటి పట్టణ వాసులకు అందించే నీటి సరఫరాపై పడిందే మాట వినిపిస్తోంది. రెండు దశాబ్దాల కిందట వరకూ గుక్కెడు నీటికోసం రాయచోటి వాసులు తపించిన విషయం నేటికీ కళ్లెదుట కనిపిస్తోంది. నాడు ఖాళీ బిందెలు సైకిళ్లు, ఎద్దులబండ్లు, అనుకూలమైన వాహనాలతో పట్టణ పరిసర ప్రాంతాలకు వెళ్లి పైసలు చెల్లించి చెమటోడ్చి నీటిని తెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఒక్కమాటలో చెప్పాలంటే పట్టణ వాసులు నీటికోసం పోరాడిన రోజులే ఎక్కువ.

నీటికోసం అవస్థలు తప్పవా?

వెలిగల్లు జలాశయం నుంచి నీటిని అందించడంలో పురపాలక శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పట్టణ వాసులకు ఈ ఏడాది దాహం కేకలు తప్పడం లేదు. పట్టణ పరిధిలో అక్కడక్కడ కొద్దో గొప్పో బోర్ల నుంచి పైపులైన్ల ద్వారా వివిధ ప్రాంతాలకు దిస్తున్న వందల లీటర్ల నీటి లీకేజీలు, నిర్వహణ లోపాలతో వృథా వుతోంది. ప్రధాన పైపులైన్ల నుంచి పట్టణంలోని 12457 ఇళ్లకు వారానికి ఒక రోజు వంతున నీటి కనెక్షన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇంకా 6 నుంచి 8 వేల కుటుంబాలకు నీటి సరఫరా సక్రమంగా లేదు. వారందరికీ నీరందించేందుకు వెలిగల్లు నుంచి రాయచోటికి, అనంతరం పట్టణంలో 125 కిలోమీటర్ల మేర పైపులైన్‌ ఏర్పాటు చేశారు. పైపులైన్లు, వాల్వ్‌ల నుంచి లీకేజీలు ఎక్కువగా ఉండడం, పైపులైన్లు తుప్పుపట్టి పగిలిపోవడం, కొత్తగా ఏర్పాటు చేసినవి బిగించకపోవడం తదితర కారణాలతో లీకేజీలు అధికంగా ఉన్నాయి. దీంతో పగలు, రాత్రి తేడా లేకుండా గంటల తరబడి ప్రధాన రహదారులు, వీధులలో నీరు వృథాగాపోతోంది. 206 వీధులు ఉండగా అందులో నూరు వీధుల్లో పైపులైన్లు దెబ్బతిని నీరు వృథాపోతోంది. దీనికి తోడు ప్రధాన పైపులైన్‌ నుంచి ఇళ్లకు సరఫరా చేయడానికి అంగుళం పరిమాణం కలిగిన గొట్టాలను అక్కడక్కడా మురుగు కాలువల నుంచి ఏర్పాటు చేశారు. పైపులు దెబ్బతింటే నీరు మురుగుతో కలిసి కలుషితమయ్యే ప్రమాదం ఉంది. ఈ సంఘటనలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నా.. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు ఇప్పటి వరకు చేపట్టడలేదు.

ప్రధాన పైపులైన్‌ నిర్మాణ పనులు చేపట్టాలి

రాయచోటి పట్టణ ప్రజల దాహార్తి తీర్చడానికి చేపట్టిన రెండో నీటి పథకం పనులు పూర్తిచేయాలి. అప్పటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి రూ.100 కోట్ల నిధులు రెండో పైపులైన్‌ నిర్మాణానికి మంజూరు చేయించారు. 60 శాతానికి పైగా పూర్తి చేయించారు. మిగిలిన పనులను పూర్తి చేయించి పట్టణ ప్రజల దాహార్తి తీర్చాల్సి ఉంది. పాత పురపాలక కేంద్రంలో తకొత్త ట్యాంకు నిర్మించాల్సి ఉంది. లీకేజీలకు మరమ్మతులు చేయించాల్సి ఉంది.

– ఫయాజ్‌బాషా, మున్సిపల్‌ ఛైర్మన్‌, రాయచోటి

జిల్లా కేంద్రానికి తప్పని తాగునీటి ఎద్దడి

పైపుల లీకేజీలతో ప్రతి నిత్యం నీరు వృఽథా

నాడు దివంగత వైఎస్సార్‌ చొరవతో తీరిన దాహార్తి

నేడు రూ.100 కోట్లతో చేపట్టిన

పనుల నిలిపివేత

పెరిగిన జనాభాకు

15 మిలియన్‌ లీటర్లు అవసరం

సమస్యను అధిగమిస్తాం

జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్యను ప్రణాళికాబద్ధంగా అధిగమిస్తాం. పట్టణంలో పైపులైన్ల నుంచి నీటి లీకేజీలు అరికట్టడానికి చర్యలు చేపట్టాం. దెబ్బతిన్న పైపులైన్లు గుర్తించి వాటికి మరమ్మతులు చేస్తాం. తద్వారా నీరు వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. వెలిగల్లు నుంచి రెండో పైపు నిర్మాణ పనులు పాత కాంట్రాక్టర్‌ ద్వారానే కొనసాగించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆదేశించారు. – వాసుబాబు, మునిసిపల్‌ కమిషనర్‌, రాయచోటి

No comments yet. Be the first to comment!
Add a comment
ఎండలు మండుతున్నాయి.. రాబోయే రెండు నెలల్లో 44 డిగ్రీలకు 1
1/5

ఎండలు మండుతున్నాయి.. రాబోయే రెండు నెలల్లో 44 డిగ్రీలకు

ఎండలు మండుతున్నాయి.. రాబోయే రెండు నెలల్లో 44 డిగ్రీలకు 2
2/5

ఎండలు మండుతున్నాయి.. రాబోయే రెండు నెలల్లో 44 డిగ్రీలకు

ఎండలు మండుతున్నాయి.. రాబోయే రెండు నెలల్లో 44 డిగ్రీలకు 3
3/5

ఎండలు మండుతున్నాయి.. రాబోయే రెండు నెలల్లో 44 డిగ్రీలకు

ఎండలు మండుతున్నాయి.. రాబోయే రెండు నెలల్లో 44 డిగ్రీలకు 4
4/5

ఎండలు మండుతున్నాయి.. రాబోయే రెండు నెలల్లో 44 డిగ్రీలకు

ఎండలు మండుతున్నాయి.. రాబోయే రెండు నెలల్లో 44 డిగ్రీలకు 5
5/5

ఎండలు మండుతున్నాయి.. రాబోయే రెండు నెలల్లో 44 డిగ్రీలకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement