వీరబల్లి : మండలంలోని గుర్రప్పగారిపల్లి పంచాయతీలోని కొత్త వడ్డిపల్లిలో తెలుగుదేశం పార్టీ వర్గీయుల మధ్య పైపులైన్ కోసం మంగళవారం ఉదయం ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో జగన్‌మోహన్ రాజు వర్గీయులు సుగవాసి బాల సుబ్రమణ్యం వర్గీయులైన చంద్రశేఖర్‌పై దాడి చేశారు. ఈ దాడిలో చంద్రశేఖర్ తలకు బలమైన గాయం తగిలింది. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం ఇరువర్గీయులైన చంద్రశేఖర్, చంద్రమోహన్‌లు పైపులైన్ గేట్ వాల్ గురించి వాదోపవాదాలు చేరుకున్నారు. అంతటితో ఆగకుండా మంగళవారం తెల్లవారుజామున జగన్ మోహన్ రాజు వర్గీయులైన వీరనాగయ్య, చంద్రమోహన్‌లు కలిసి బాలసుబ్రమణ్యం వర్గీయులైన చంద్రశేఖర్‌పై దాడి చేసి గాయపరిచారు. ఈ ఘర్షణలో చంద్రశేఖర్ తలకు బలమైన గాయం తగిలింది. బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడిని పోలీసులు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
స్టార్టర్ చోరీపై ఫిర్యాదు
నిమ్మనపల్లె : మండలంలోని అగ్రహారం గ్రామానికి చెందిన మునిరత్నం అలియాస్ రామారావుకు చెందిన బోరుబావి వద్ద సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రూ. 12 వేలు విలువచేసే స్టార్టర్ పెట్టెను చోరీ చేశారు. మంగళవారం ఉదయం బోరు వద్దకు వెళ్లిన రైతు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించాడు. వెంటనే నిమ్మనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇద్దరిపై 6ఏ కేసు నమోదు
సిద్దవటం : రేషన్ బియ్యం 750 కిలోలు ఉన్నట్లు గుర్తించి డీలర్ బి. సుబ్బరాయుడు, ఎండీయూ ఆపరేటర్ శంకర్‌లపై మంగళవారం 6ఏ కేసు నమోదు చేశామని విజిలెన్స్ ఎఫోర్స్‌మెంట్ సీఐ శివన్న తెలిపారు. మాధవరం–1 గ్రామంలో రేషన్ అక్రమంగా రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో సోమవారం రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించామన్నారు. దాడుల్లో వీరి నివాసాల్లో 750 కిలోల రేషన్ బ్యియం పట్టుబడ్డాయన్నారు. ఈ దాడిలో సివిల్ సప్‌లై డిప్యూటీ తహసీల్దార్ సౌజన్య, వీఆర్‌ఓ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment