అన్ని వర్గాలను మోసం చేశారు
అన్ని వర్గాలను అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఈ ఏడాది పంగనామం పెట్టింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి నిధులు ఇవ్వకపోవటంతో వారంతా అప్పుల పాలు అవుతున్నా రు. ఉద్యోగం ఇవ్వకుంటే నిరుద్యోగభృతి అంటూ హామీలిచ్చి, ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం దారుణం. –ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ
జిల్లా అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే
జాబ్ క్యాలెండర్ ఊసే లేదు
జనవరిలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఆర్భాటంగా చేసిన ప్రకటన నేటికీ అమ లు కాలేదు. నిరుద్యోగభృతి మరచిపోయారు. నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. నిద్ర మత్తులో ఉన్న ఈ ప్రభుత్వానికి పోరుబాటతో మేల్కొలుపుతాం. –జె.కిషోర్‌దాస్, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడు
నిరుద్యోగభృతి ఎప్పుడో... ?
సూపర్ సిక్స్‌లో భాగంగా నిరుద్యోగభృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామన్న హామీ ఇచ్చారు. అమలు చేయడం లేదు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న యువత పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కూటమి ప్రభుత్వం నిరుద్యోగభృతి అందించి నిరుద్యోగులను ఆదుకోవాలి. ఆ దిశగా ముందడుగు వేయాలి. – శివప్రసాద్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా
యువజన విభాగం అధ్యక్షుడు
అన్ని వర్గాలను మోసం చేశారు
అన్ని వర్గాలను మోసం చేశారు
అన్ని వర్గాలను మోసం చేశారు
Comments
Please login to add a commentAdd a comment