రాయచోటి జగదాంబసెంటర్: జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు దార్శనిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి అర్హులైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కలెక్టర్ అధ్యక్షతన ఐదు మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
● జిల్లా దార్శనిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం కోసం ఐదుగురుని ఎంపిక చేస్తారు.
అర్హత: మహిళా పోలీస్ (లేదా) సర్వే అసిస్టెంట్ (లేదా) వీఆర్‌ఓ/ వార్డు రెవెన్యూ సెక్రటరీ (లేదా) వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ
విద్యార్హత: స్టాటిస్టిక్స్/మ్యాథమేటిక్స్/ఎకనామిక్స్/కామర్స్/ కంప్యూటర్ సైన్స్/ ఎంబీఏ/ ఇంజనీరింగ్ ఏదైనా ఒక దానిలో బ్యాచిలర్ డిగ్రీ ఉండి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
● నియోజకవర్గ దార్శనిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం కోసం ఒక్కో నియోజకవర్గం కొరకు ఐదుగురిని ఎంపిక చేస్తారు.
అర్హత: మహిళా పోలీస్ (లేదా) సర్వే అసిస్టెంట్ (లేదా) విఆర్‌ఓ/ వార్డు రెవెన్యూ సెక్రటరీ (లేదా) వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ
విద్యార్హత: స్టాటిస్టిక్స్/ మ్యాథమేటిక్స్/ ఎకనామిక్స్/ కామర్స్/ కంప్యూటర్‌సైన్స్/ ఎంబీఏ/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ పొలిటికల్ సైన్స్/ అగ్రికల్చర్ అండ్ అల్లాయిడ్ సబ్జెక్ట్స్/ ఇంజనీరింగ్ ఏదైనా ఒక దానిలో బ్యాచిలర్ డిగ్రీ ఉండి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారు అర్హులు. ఆసక్తి గల వారు దరఖాస్తులను కలెక్టరేట్‌లోని ముఖ్య ప్రణాళిక అధికారి వారి కార్యాలయం నుంచి, ఎంపీడీఓ కార్యాలయాల నుంచి తీసుకోవాలన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వారి కార్యాలయం, కలెక్టరేట్, రాయచోటిలో సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.