కోర్టు కాంప్లెక్స్‌కు ‘రెవెన్యూ’ గ్రహణం! | - | Sakshi
Sakshi News home page

కోర్టు కాంప్లెక్స్‌కు ‘రెవెన్యూ’ గ్రహణం!

Apr 2 2025 1:38 AM | Updated on Apr 2 2025 1:38 AM

కోర్ట

కోర్టు కాంప్లెక్స్‌కు ‘రెవెన్యూ’ గ్రహణం!

రాజంపేట : రాజంపేట కోర్టు భవనాల సముదాయం అభివృద్ధికి సంబంధించి న్యాయశాఖ, రెవెన్యూ శాఖ మధ్య కుదర్చుకున్న ఒప్పందంలో భాగంగా రెవెన్యూ గ్రహణానికి పన్నెండేళ్లైంది. న్యాయశాఖ తన వంతుగా సబ్‌కలెక్టరేట్‌లో ఉన్న న్యాయశాఖ భవనాల(సబ్‌జడ్జి క్వార్టర్స్‌, భవనాలు)ను రెవెన్యూకు అప్పగించింది. అయితే న్యాయశాఖకు ఇవ్వాల్సిన తహసీల్దారు కార్యాలయం భవనం ఇప్పటి వరకు అప్పగించకపోవడంతో .. మేము ఇచ్చాము..మీరెప్పుడు ఇచ్చేదంటున్నారు రాజంపేట బార్‌ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు.

2013లో ఒప్పందం ఇలా..

2013లో అప్పటి కలెక్టర్‌, జడ్జిలు కోర్టు కాంప్లెక్స్‌ ఏర్పాటులో భాగంగా కోర్టు ఆవరణంలో ఉన్న తహసీల్దారు కార్యాలయం తీసుకుని, ఇందుకుగాను ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న న్యాయశాఖ భవనాలను అప్పగించేలా ఒప్పందం చేసుకున్నారు. అప్పట్లో కోర్టు భవనాల నిర్మితం కోసం స్థలం విషయంలో రాజంపేట బార్‌ అసోసియేషన్‌ హైకోర్టులో రిట్‌కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అప్పటి కలెక్టర్‌, హైకోర్టు ఆదేశాలతో గతంలో చేసుకున్న ఒప్పందం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. కాని అమలు విషయంలో కాలం కొనసాగుతూ వస్తోంది.

నూతన జిల్లా ఆవిర్భావంతో.. అటకెక్కిన ఒప్పందం..

వైఎస్సార్‌ కడప జిల్లా పరిధిలో ఉన్నప్పుడు రెవె న్యూ, న్యాయశాఖ మధ్య జరిగిన ఒప్పందం నూతనంగా అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత అటకెక్కింది. రాజంపేట అన్నమయ్య జిల్లా పరిధిలోకి వెళ్లిపోవడంతో ఈ ఒప్పందం అమలు చేసే విష యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఏర్పడకముందు కోర్టు కాంప్లెక్స్‌ ఒప్పందం ఒక కొలి క్కి వచ్చిన సంగతి తెలిసిందే. రికార్డుపరంగా తహసీల్దారు కార్యాలయానికి ఇచ్చినట్లుగా న్యాయవాదులు చెబుతున్నారు. అయితే భౌతికంగా అప్పగించలేదన్న వాదన బార్‌ అసోసియేషన్‌ వినిపిస్తోంది.

కక్షిదారుల సౌకర్యాలు.. నూతన భవనాలు నిర్మితమెప్పుడో..

రాజంపేట కోర్టు క్లాంపెక్స్‌ ఒప్పందంలో భాగంగా కాంప్లెక్స్‌ నిర్మితం చేయాలని రాజంపేట బార్‌ అసోసియేషన్‌ అప్పటి అధ్యక్షుడు కె.శరత్‌కుమార్‌రాజు ప్రయత్నించారు. ఇందులో భాగంగా కక్షిదారులకు మెరుగైన సౌకర్యాలు, నూతన భవనాలు, బార్‌ అసోసియేషన్‌ భవనం లాంటివి నిర్మితం చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ విడుదల చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే కోర్టు కాంప్లెక్స్‌ ఒప్పందం పూర్తిగా అమలు కాకపోవడంతో పెండింగ్‌ పడిపోయింది.

రెవెన్యూకు న్యాయశాఖ

భవనాలు అప్పగింత

న్యాయశాఖకు అప్పగించని

తహసీల్దార్‌ భవనం

కోర్టు కాంప్లెక్స్‌ ఒప్పందానికి పన్నెండేళ్లు!

కోర్టు కాంప్లెక్స్‌ ఒప్పందం న్యాయశాఖ అమలు చేసింది

రెవెన్యూ, న్యాయశాఖ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా సబ్‌ కలెక్టరేట్‌లో న్యాయశాఖ భవనాలను రెవెన్యూకు అప్పగించింది. అయితే కోర్టు కాంప్లెక్స్‌లో ఉన్న తహసీల్దారు కార్యాలయం ఇంతవరకు న్యాయశాఖకు అప్పగించలేదు. ఇది అప్పటి కడప కలెక్టర్‌, జిల్లా జడ్జిలు సమన్వయంగా తీసుకున్న నిర్ణయం. హైకోర్టు ఆదేశం మేరకు ఒప్పందం జరిగి 12 ఏళ్లు అవుతోంది. ఇప్పటికై నా రెవెన్యూ స్పందించాలి. తహసీల్దారు కార్యాలయం అప్పగించిన వెంటనే రాజంపేట కోర్టుకు నూతన భవనాలు, కక్షిదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాము.

– కొండూరు శరత్‌కుమార్‌రాజు, మాజీ అధ్యక్షుడు, బార్‌ అసోసియేషన్‌

తహసీల్దారు కార్యాలయం అప్పగింతలో రెవెన్యూ జాప్యం

కోర్టు కాంప్లెక్స్‌ ఒప్పందం మేరకు తహసీల్దారు కార్యాలయం అప్పగింత విషయంలో రెవెన్యూ జాప్యం చేస్తోంది. రికార్డు పరంగా ఇస్తే ఏమీ లాభం లేదు. తహసీల్దారు కార్యాలయం అప్పగిస్తే ఉన్న స్థలంలో కోర్టు నూతన భవనాలను నిర్మితం చేసుకోవచ్చు. ప్రభుత్వ పెద్దల సహకారంతో నిధులు కేటాయించుకునేందుకు వీలవుతుంది.

–హనుమంతనాయుడు, అధ్యక్షుడు,

బార్‌ అసోసియేషన్‌, రాజంపేట

కోర్టు కాంప్లెక్స్‌కు ‘రెవెన్యూ’ గ్రహణం!1
1/3

కోర్టు కాంప్లెక్స్‌కు ‘రెవెన్యూ’ గ్రహణం!

కోర్టు కాంప్లెక్స్‌కు ‘రెవెన్యూ’ గ్రహణం!2
2/3

కోర్టు కాంప్లెక్స్‌కు ‘రెవెన్యూ’ గ్రహణం!

కోర్టు కాంప్లెక్స్‌కు ‘రెవెన్యూ’ గ్రహణం!3
3/3

కోర్టు కాంప్లెక్స్‌కు ‘రెవెన్యూ’ గ్రహణం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement