చదువు కోసం.. వ్యాపార నిమిత్తం.. పర్యాటక ప్రదేశాలు.. ఇలా ఎన్నో సుదూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే ముందు గుర్తొచ్చేది రైలు ప్రయాణమే. దశాబ్దాల క్రితం నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఓబులవారిపల్లె జంక్షన్‌లో నిలిపేవారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల స్టా | - | Sakshi
Sakshi News home page

చదువు కోసం.. వ్యాపార నిమిత్తం.. పర్యాటక ప్రదేశాలు.. ఇలా ఎన్నో సుదూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే ముందు గుర్తొచ్చేది రైలు ప్రయాణమే. దశాబ్దాల క్రితం నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఓబులవారిపల్లె జంక్షన్‌లో నిలిపేవారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల స్టా

Apr 3 2025 12:28 AM | Updated on Apr 3 2025 12:28 AM

చదువు

చదువు కోసం.. వ్యాపార నిమిత్తం.. పర్యాటక ప్రదేశాలు.. ఇలా

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు స్టాపింగ్‌ కల్పించాలి

నాకు ఉహ తెలిసిన నాటి నుంచి ఈ స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలుపుతుండేవారు. ఇప్పుడు ఒక్క ఎక్స్‌ప్రెస్‌ కూడా నిలపటం లేదు. మా పిల్లలు బిటెక్‌ చదువుతున్నారు. దూ ర ప్రాంతాల నుంచి రావాలాన్నా.. వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంది. కొద్ది రోజులు స్టాపింగ్‌ కల్పిస్తారు మళ్లీ తొలగిస్తారు. ఇప్పటికై నా రద్దు చేసిన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు వెంటనే స్టాపింగ్‌ కల్పించాలి.

– ఓడి సురేంద్రా రెడ్డి, రైతు, ఓబులవారిపల్లె

రైల్వేశాఖ అలసత్వం

పేరుకే జంక్షన్‌. రైల్వే శాఖ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు స్టాపింగ్‌ తొలగించారు. ఉద్యోగ, వ్యాపార, స్థానిక ప్రజలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు స్టాపింగ్‌ తొలగించడంతో ఇబ్బంది పడుతున్నారు. రాజకీయ నాయకులు, రైల్వే శాఖ అధికారులు స్పందించి ప్రస్తు తం స్టాపింగ్‌ ఎత్తివేసిన హరిప్రియా, రాయలసీమలతో పాటు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు స్టాపింగ్‌ కల్పించాలి. –రాజు నాయక్‌,

ఉపాధ్యాయుడు, ఓబులవారిపల్లె

ఓబులవారిపల్లె: కృష్ణపట్నం ఓడరేవుకు రైలు మార్గం నిర్మించడంతో ఓబులవారిపల్లె జంక్షన్‌గా మారింది. రాజంపేట పార్లమెంట్‌ నియోజవర్గం దక్షిణ భారతదేశ అతిపెద్ద సొరంగ మార్గం గుండా నెల్లూరు కృష్ణపట్నం పోర్టుకు రైలు మార్గం ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతం రైల్వే పరంగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఎంతగానో ఆశపడి ఎదురు చూశారు. అయితే ఎటువంటి అభివృద్ధి జరగకపోగా అప్పటి వరకు ఓబులవారిపల్లె జంక్షన్‌లో నిలబడుతు న్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల స్టాపింగ్‌ను రైల్వేశాఖ ఎత్తి వేసింది.

దశాబ్దాల క్రితం నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలబడేవి

దశాబ్దాల కాలం క్రితం నుంచి ఓబులవారిపల్లె రైల్వేస్టేషన్‌లో అప్పటిలో స్టిమ్‌ ఇంజిన్‌ ప్యాసింజర్‌, షటిల్‌ రైళ్లతో పాటు జనతాఎక్స్‌ప్రెస్‌ ,రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలబడేవి. దశాబ్దాల పాటు ఈ రైళ్లు నడిచాయి. ఎప్పుడూ స్టాపింగ్‌ తొలగించలేదు. అయితే కాలక్రమేణ జనతా ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేశారు. దీంతో అప్పట్లో స్థానిక రాజకీయ నాయకులు ముంబాయి, చైన్నె ఎక్స్‌ ప్రెస్‌ స్టాపింగ్‌ కల్పించాలని అప్పటి నుండి రైల్వేవర్గాలను కోరూతూనే ఉన్నారు. అనంతరం కొల్హాపూర్‌ –తిరుపతి హరిప్రియా ఎక్స్‌ప్రెస్‌, కాచిగూడ–తిరుపతి వేంకటాద్రి రైళ్లు నిలబడేవి.

ప్రజలు, వ్యాపారులు,

ఉద్యోగులకు అవస్థలు

ప్రతి నెలా దాదాపు కోటి రూపాయలకు పైనే ఓబులవారిపల్లె రైల్వే టికెట్‌ల ద్వారా ఆదాయం లభిస్తోంది. అయినా ఇక్కడ రైళ్లును రద్దు చేయడం ఏమిటని ప్రజలు పశ్నిస్తున్నారు. ప్రతి నిత్యం హైదారాబాదు, చైన్నె, హుబ్లీ తదితర ప్రాంతాలకు మండల కేంద్రం నుంచి వ్యాపారులు వేళ్లేవారు. ప్రజలు పట్టణ ప్రాంతలలోని ఆసుపత్రులకు అనూకులంగా ఉండేది. రాష్ట్ర రాజధాని విజయవాడకు, ఇతర పట్టణాలకు ప్రస్తుతం నేరుగా వెళ్లాలంటే రేణిగుంట, రాజంపేటకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

కోవిడ్‌ అనంతరం రైళ్లు తొలగింపు

ఓబులవారిపల్లె రైల్వే జంక్షన్‌పై

కేంద్ర ప్రభుత్వం సీత కన్ను

దశాబ్దాలుగా ఉన్న స్టాపింగ్‌ ఎత్తివేత

కూటమి నాయకుల అసమర్థత

కేంద్ర మంత్రికి ఎంపీ మిథున్‌రెడ్డి పలుమార్లు వినతి

దూర ప్రాంతాలకు ఎలా వెళ్లాలి : రాష్ట్ర రాజధాని విజయవాడ, విశాఖపట్టణానికి, తెలంగాణ రాజధాని హైదారాబాద్‌కు నేరుగా వెళ్లాలంటే ఓబులవారిపల్లె జంక్షన్‌ నుంచి రైళ్లు లేవు. రైల్వే శాఖ అధికారులు ఉన్నతాధికారులు స్పందించి రద్దు చేసిన రైళ్లతో పాటు తిరుమల, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లకు స్టాపింగ్‌ కల్పించాలని స్థానికులు కోరుకుంటున్నారు.

స్థానికంగా ఆపుతున్న రైళ్లను కోవిడ్‌ కారణంగా పూర్తిగా ఇక్కడ రద్దు చేశారు. కోవిడ్‌ అనంతరం వెంకటాద్రి, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ల స్టాపింగ్‌ తొలగించారు. హరిప్రియ మాత్రమే నిలిపేవారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పలుమార్లు కేంద్ర మంత్రిని కోరి వినతి పత్రం అందజేయగా రాయలసీమకు గత ఏడాది మార్చి నెలలో స్టాపింగ్‌ కల్పించారు. అప్పటి నుంచి ఓబులవారిపల్లె జంక్షన్‌లో రెండు ఎక్సప్రెస్‌ రైళ్లు మాత్రమే నిలబడేవి. అయితే ప్రస్తుతం ఆ రెండు రైళ్లు స్టాపింగ్‌ కూడా రైల్వే అధికారులు రద్దు చేశారు. దీంతో ఆ జంక్షన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఒకట్టి కూడా నిలబడటం లేదు. ఇటివలే ఈ విషయంపై రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఢిల్లీ పర్యటలో కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని అందించారు.

చదువు కోసం.. వ్యాపార నిమిత్తం.. పర్యాటక ప్రదేశాలు.. ఇలా1
1/3

చదువు కోసం.. వ్యాపార నిమిత్తం.. పర్యాటక ప్రదేశాలు.. ఇలా

చదువు కోసం.. వ్యాపార నిమిత్తం.. పర్యాటక ప్రదేశాలు.. ఇలా2
2/3

చదువు కోసం.. వ్యాపార నిమిత్తం.. పర్యాటక ప్రదేశాలు.. ఇలా

చదువు కోసం.. వ్యాపార నిమిత్తం.. పర్యాటక ప్రదేశాలు.. ఇలా3
3/3

చదువు కోసం.. వ్యాపార నిమిత్తం.. పర్యాటక ప్రదేశాలు.. ఇలా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement