
పనులు త్వరగా పూర్తిచేయాలి
సిద్దవటం : ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలను పురష్కరించుకొని సిద్దవటం మండలం లోని కడప– చైన్నె ప్రధాన రహదారికి ఇరువైపులా పారుశుధ్య పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఆమె భాకరాపేట, కనుమలోపల్లె గ్రామాల్లో జరిగే పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీఓ విజయ భాస్కర్, ఈఓపీఆర్‌డీ మోహతాబ్ యాస్మిన్, పంచాయతీ కార్యదర్శులు రాజేష్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
సుండుపల్లె : ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఈడీ ఊర్మిళ తెలిపారు. మండల కేంద్రంలోని చెత్త నుంచిసంపద తయారీ కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి తడి చెత్త – పొడి చెత్తను వేరు చేసి చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి తరలించాలని, సేంద్రీయ ఎరువులను తయారు చేయాలని తెలిపారు. పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా పంచాయతీ అధికారి మస్తాన్‌వల్లి, ఎంపీడీఓ సుధాకర్‌రెడ్డి, ఈఓపీఆర్‌డీ సురేష్‌బాబు, రీసోర్స్ పర్సన్ మధు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సి.యామిని
కడప అర్బన్ : వైఎస్సార్ ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సి.యామిని నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జి. శ్రీదేవి అనంతపురంలోని ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ లేబర్ కోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. కడపలోని ఆర వ అదనపు జిల్లా (ఫ్యామిలీ కోర్ట్) జడ్జిగా పనిచేస్తున్న షేక్ ఇంతియాజ్ అహ్మద్ విజయవాడ జిల్లా కోర్టులో 14 అదనపు జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. చిత్తూరు జిల్లా కోర్టులో పోక్సో కోర్టు జడ్జ్‌గా పని చేస్తున్న ఎన్.శాంతి కడపలోని ఆరవ అదనపు జిల్లా జడ్జిగా నియమితులయ్యారు.
రిజిస్ట్రేషన్‌కు
19 స్లాట్ బుకింగ్‌లు
కడప కోటిరెడ్డిసర్కిల్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ సేవలను మరింత సులభతరం చేసేందుకు స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అన్ని జిల్లాల్లో కేంద్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కడప అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికి దస్తావేజులను అందజేశారు. సోమవారం 19 స్లాట్ బుకింగ్‌చేసుకున్న వారికి దస్తావేజులను అందజేసినట్లు సబ్ రిజిస్ట్రార్ హరికృష్ణ తెలిపారు. కొత్త విధానంతో ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఎక్కువ సమయం వృథా కాదని, ప్రజలు నిరీక్షించే బాధ తగ్గుతుందన్నారు. అలాగే క్యూఆర్ కోడ్‌తోనూ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు తమ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచామన్నారు.

పనులు త్వరగా పూర్తిచేయాలి