
నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి
చిట్వేలి : అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం ఎం. రాచపల్లిలో శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చొక్కారాజు దేవాన్స్ (5), చొక్కారాజు విజయ్(4), రెడ్డిచెర్ల యశ్వంత్ (5) ఆడుకోవడానికి పక్కనే ఉన్న కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ అందులో ఉన్న నీటిలో పడి మృతి చెందారు. చిన్నారుల ఆచూకీ కోసం వెతుకుతుండగా కుంటలో విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే ముగ్గురిని చిట్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో గ్రామమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
చిన్నారుల కోసం
శిశుగృహలో సంప్రదించండి
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడ ప రైల్వేస్టేషన్‌లో సాకేత్ (3), మల్లి (2) అనే చిన్నారు లు ఉన్నారని తెలియడంతో ఐసీడీఎస్ సీడీపీఓ, సూపర్‌వైజర్, మహిళా పోలీసులు చిన్నారులు తీసుకుని సీడబ్ల్యుసీ ఎదుట హాజరు పరిచామని ఐసీడీఎస్ పీడీ దేవిరెడ్డి శ్రీలక్ష్మి శుక్రవారం తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే బాలల సంక్షేమ సమితిలో సంప్రదించి తీసుకు వెళ్లాలన్నారు.
చౌకదుకాణం సీజ్
బద్వేలు అర్బన్ : మండల పరిధిలోని శీలంవారిపల్లె గ్రామంలోని చౌకదుకాణాన్ని శుక్రవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ శివశంకర్ ఆధ్వర్యంలో రేషన్ షాపును తనిఖీ చేయగా అందులో 4897 కేజీల బియ్యం, 128 కేజీల చక్కెర తక్కువగా ఉన్నట్లు గుర్తించి సంబంధిత డీలర్‌పై కేసు నమోదు చేయడంతో పాటు రేషన్ షాపును సీజ్ చేసినట్లు డీటీ తెలిపారు.

నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి

నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి

నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి