
పూలే ఆశయసాధనకు కృషి చేయాలి
రాయచోటి: అణగారిన వర్గాల అభ్యున్నతికోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం రాయచోటి కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించారు. ఆ మహనీయుని చిత్రపటానికి కలెక్టర్, జేసీ, డీఆర్‌ఓ, అధికారులు, బీసీ సంఘ నాయకులు, ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి, సీ్త్ర విద్యకు పాటుపడిన గొప్ప సంస్కర్తగా పూలే పేరొందారన్నారు. ఆ మహనీయుని ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సమావేశంలో జేసి ఆదర్శ రాజేంద్రన్, డీఆర్‌ఓ మధుసూదన్ రావు పాల్గొన్నారు.
● బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి నిమిత్తం 707 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు చొప్పున మొత్తంగా రూ. 14.14 కోట్ల రాయితీ మెగా చెక్కును కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి సురేష్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్ జయసింహ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్
16లోపు అభ్యంతరాలు తెలపాలి
కడప ఎడ్యుకేషన్: రాయలసీమ పరిధిలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు పూర్వపు జిల్లాల్లోని స్కూల్ అసిస్టెంట్(గవర్నమెంట్) నుంచి గ్రేడ్ –2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు(గవర్నమెంట్) తాత్కాలిక జాబితా వెబ్‌సైట్ https:/rjdsekadapa.blog spot.comలో ఉంచినట్లు పాఠశాల విద్య ఆర్‌జేడీ కాగిత శ్యాముల్ తెలి పారు. కావున ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాల్లో తగిన ఆధారాలతో ఈ నెల 16లోపు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు.