ప్యాసింజర్‌ రైళ్లు తాత్కాలిక రద్దు | - | Sakshi
Sakshi News home page

ప్యాసింజర్‌ రైళ్లు తాత్కాలిక రద్దు

Apr 15 2025 12:49 AM | Updated on Apr 15 2025 12:49 AM

ప్యాసింజర్‌ రైళ్లు తాత్కాలిక రద్దు

ప్యాసింజర్‌ రైళ్లు తాత్కాలిక రద్దు

కలికిరి : తిరుపతి నుంచి పాకాల, ధర్మవరం మీదు గా గుంతకల్‌, కదిరిదేవరపల్లి వరకు నడిచే ప్యాసింజర్‌ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మవరం జంక్షన్‌ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనుల కారణంగా 35 రోజుల పాటు ప్యాసింజర్‌ రైళ్లు రద్దు చేశారు. అలాగే కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దుతో పాటు, కదిరి, మదనపల్లి రోడ్‌, పీలేరు, పాకాల మీదుగా నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దారిమళ్లించారు.

వాటి వివరాలు ఇలా ఉన్నాయి

తిరుపతి – గుంతకల్‌ ప్యాసింజర్‌(57403) మే నెల 18వ తేదీ వరకు, గుంతకల్‌ – తిరుపతి ప్యాసింజర్‌(57404) మే నెల 19వ తేదీ వరకు, తిరుపతి – కదిరిదేవరపల్లి ప్యాసింజర్‌(57405) మే నెల 16వ తేదీ వరకు, కదిరిదేవరపల్లి – తిరుపతి ప్యాసింజర్‌(57406) మే నెల 17వ తేదీ వరకు రద్దయ్యాయి. అలాగే తిరుపతి–అమరావతి ఎక్స్‌ప్రెస్‌(12765) మే నెల 6, 10, 13, 17 తేదీలలో రద్దు చేశారు. అమరావతి–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ (12766) మే నెల 5, 8, 12, 15 తేదీలలో రద్దు చేశారు.

దారి మళ్లింపు ఇలా..

తిరుపతి–అకోలా వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌(07605) పాకాల, పీలేరు, ధర్మవరం మీదుగా కాకుండా మే నెల 9, 16 తేదీలో తిరుపతి నుంచి రేణిగుంట, గుత్తి మీదుగా దారి మళ్లించారు. అకోలా–తిరుపతి వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌(07606) ధర్మవరం, కదిరి, పీలేరు, పాకాల మీదుగా కాకుండా మే నెల 4, 11 తేదీలలో గుత్తి, రేణిగుంట మీదుగా తిరుపతికి దారి మళ్లించారు. తిరుపతి–సికింద్రాబాద్‌ సెవెన్‌హిల్స్‌(12769) వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను మే నెల 5, 9, 12, 16 తేదీలలో పాకాల, పీలేరు, కలికిరి, కదిరి, ధర్మవరం మీదుగా కాకుండా తిరుపతి నుంచి రేణిగుంట, కడప, గుత్తి మీదుగా, అలాగే సికింద్రాబాద్‌–తిరుపతి సెవెన్‌హిల్స్‌(12770) వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను మే నెల 6, 9, 13, 16 తేదీలలో గుత్తి నుంచి కడప, రేణిగుంట మీదుగా తిరుపతి రూట్‌కు మార్చారు. పాకాల, కలికిరి, కదిరి మీదుగా నడిచే తిరుపతి–సికింద్రాబాద్‌(12731) సూపర్‌ ఫాస్ట్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ను మే నెల 8, 11, 15 తేదీలలో తిరుపతి నుంచి రేణిగుంట, కడప, గుత్తి మీదుగానూ, ధర్మవరం నుంచి కదిరి, కలికిరి, పీలేరు మీదుగా నడిచే సికింద్రాబాద్‌–తిరుపతి(12732) సూపర్‌ ఫాస్ట్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ను మే నెల 7, 10, 14 తేదీలలో గుత్తి, కడప, రేణిగుంట మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. పాకాల, పీలేరు, మదనపల్లి రోడ్‌ కదిరి మీదుగా నడిచే మధురై–కాచిగూడ(07192) స్పెషల్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ మే నెల 5, 12 తేదీలలో గుత్తి, కడప, రేణిగుంట, తిరుపతి, పాకాల మీదుగానూ, కాచిగూడ–మధురై(07191)స్పెషల్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ మే నెల 7, 14 తేదీలలో పాకాల నుంచి తిరుపతి, రేణిగుంట, కడప, గుత్తి మీదుగానూ దారి మళ్లించారు. పాకాల, పీలేరు, ధర్మవరం మీదుగా నడిచే నాగర్‌కోయిల్‌–ముంబై(16340) ఎక్స్‌ప్రెస్‌ను మే నెల 5, 6, 7, 9, 12, 13, 14, 16 తేదీలలో పాకాల నుంచి తిరుపతి, రేణిగుంట, కడప, గుత్తి మీదుగా, ముంబై–నాగర్‌కోయిల్‌(16339)ఎక్స్‌ప్రెస్‌ను మే నెల 6, 7, 8,10,13, 14, 15 తేదీలలో గుత్తి నుంచి కడప, రేణిగుంట, తిరుపతి, పాకాల మీదుగా మళ్లించారు. మధురై–కాచిగూడ(22716) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను మే నెల 04, 11 తేదీలో పాకాల నుంచి తిరుపతి, రేణిగుంట, డోన్‌, గుత్తి మీదుగానూ, కాచిగూడ–మధురై(22715) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను మే నెల 10, 17 తేదీలలో డోన్‌, రేణిగుంట, తిరుపతి, పాకాల మీదుగా దారి మళ్లించారు. ధర్మవరం నుంచి రోజు నడిచే ధర్మవరం–నరసాపూర్‌(17248) ఎక్స్‌ప్రెస్‌ బుధవారం నుంచి కదిరి నుంచి మాత్రమే ప్రారంభమవుతుంది. అలాగే నరసాపూర్‌–ధర్మవరం(17247) ఎక్స్‌ప్రెస్‌ను మంగళవారం నుంచి కదిరి వరకు మాత్రమే నడపనున్నారు. ఈ మేరకు ప్రయాణికులు గమనించాలని అధికారులు కోరారు. కాగా గత ఏడాది డిసెంబరు 28 నుంచి మహాకుంభమేళా కోసం గుంతకల్‌–తిరుపతి ప్యాసింజర్‌ రైళ్లను సుమారు రెండు నెలలకు పైగా రద్దు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ ప్యాసింజర్‌ రైళ్లను ఈ నెల 1 నుంచి ప్రారంభించారు. ఇప్పుడు ధర్మవరం రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ కోసం నెల రోజులకు పైగా ప్యాసిజర్‌ రైళ్లను పూర్తిగా రద్దు చేయడంతో రైల్వే ప్రయాణికులపై మరో పిడుగు పడ్డట్‌లైంది.

రైలు ప్రయాణికులపై మరో పిడుగు

పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు దారి మళ్లింపు

ధర్మవరం రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణతో అధికారుల నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement