
రూ.4 లక్షలు పోయాయి
రాత్రి 12 గంటలకు మార్కెట్‌కు కాయలు తెస్తే కొనేవారు లేక మరుసటి రోజు కూడా కూర్చుంటున్నా.. 20 కిలోల ప్యాకెట్‌లు రూ.50, 60కు ఇవ్వగలవా అంటూ బేరాలు ఆడుతున్నారు. మళ్లీ, మళ్లీ ఆటోలకు రవాణా చార్జీలు ఇవ్వలేక అడిగిన ధరకు ఇచ్చేస్తున్నాం. 2.5 ఎకరాల భూమిని లక్ష రూపాయలతో కౌలుకు తీసుకొని వంగ తోట సాగు చేశాను. సాగు కోసం రూ.3 లక్షలు ఖర్చు చేసి పంట పండించాను. ఇప్పటికీ 80 శాతం పంట దిగుబడి వచ్చినా రూ.50 వేలు కూడా రావడం లేదు. మార్కెట్‌లో లభిస్తున్న ధరలను చూస్తే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. – సుబ్బారెడ్డి,
రైతు, ఏపిలవంకపల్లి, రాయచోటి మండలం