
దళారుల బారి నుంచి కాపాడాలి
రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేసి, రాత్రింబవళ్లు నిద్రలేకుండా సాగు చేసిన పంటకు మార్కెట్‌లో దళారుల కారణంగా దారుణంగా నష్టపోతున్నారు. రాయచోటి, కడప లాంటి మార్కెట్‌లో అర్ధరాత్రి వేళ కూరగాయలు వేలం వేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులు అక్కడున్న వ్యాపారులతో కుమ్మకై .. వారు నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి దళారుల బారి నుంచి రైతులను కాపాడేందుకు అధికారులు ముందుకు రావాలి.
– బాలకృష్ణారెడ్డి, రైతు సంఘం, రాయచోటి ఏరియా ప్రధాన కార్యదర్శి