
మాదక ద్రవ్యాల నివారణకు ప్రత్యేక చర్యలు
రాయచోటి : జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి అన్నారు. రాయచోటిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల నివారణకు సంబంధించిన వ్యూహాలు, ప్రణాళికల అమలు గురించి చర్చించామని, జిల్లాలో మాదక ద్రవ్యాల సమస్య సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ బృందం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1972 ద్వారా సమాచారం సేకరించడం, మాదక ద్రవ్యాల బారిన పడిన వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈగల్ టీమ్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. మందుల షాపుల్లో డాక్టర్ రసీదు లేకుండా మందులు ఇవ్వరాదని సూచించారు. మాదక ద్రవ్యాల నివారణకు నిపుణులు, మానసిక ఆరోగ్య నిపుణులు, విద్యావేత్తలతో కలిసి పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ కె.సుబ్రహ్మణ్యం, డీఎంఅండ్‌హెచ్‌ఓ జి.ఉషశ్రీ, రాయచోటి జైల్స్ సూపరిటెండెంట్ ఉమామహేశ్వర రావు, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ కిషోర్, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.జయరాముడు, ఎకై ్సజ్ సూపరిటెండెంట్ జి.మధుసూదన్, జిల్లా పంచాయతీ అధికారి ఎస్.మస్తాన్‌వలి డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఎం.తులసీరామ్, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి