
ముస్లింల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు
మదనపల్లె : ముస్లింలకు నష్టం కలిగించే వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ డిమాండ్ చేశారు. మదనపల్లె వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, ముస్లిం నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగంలోని మౌలిక హక్కులకు విరుద్ధంగా ఉన్న వక్ఫ్ సవరణ చట్టాన్ని బేషరతుగా కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలన్నారు. వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడంపై ముస్లిం సమాజం హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. క్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎంపీలు మిథున్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. తమకు మంచి చేస్తారని టీడీపీ, జనసేన పార్టీలకు ముస్లింలు ఓటువేస్తే ఇపుడు వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలిపి వారి మనోభావాలు దెబ్బతీశారన్నారు. బీజేపీ ప్రభుత్వం ముస్లింలను అణచివేసేందుకు వక్ఫ్ చట్టానికి సవరణ చేసిందని ఆరోపించారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించడంతోపాటు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముస్లింల పక్షపాతిగా నిలిచారన్నారు. ఎన్‌డీఏ కూటమిలో కీలక భాగస్వామ్యులుగా ఉన్న నితీష్‌కుమార్, చంద్రబాబునాయుడు మద్దతు తెలపకుంటే బిల్లు ఆమోదం పొందేది కాదన్నారు. ఎల్లో మీడియాలో టీడీపీ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తుందన్నట్లు విపరీతంగా ప్రచారం చేయించి, ఆ పార్టీ ఎంపీలతో బిల్లుకు మద్దతు ప్రకటించి మైనార్టీలను దగా చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్ర ప్రదేశ్‌లో వక్ఫ్ బిల్లు అమలు చేయమని ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ బిఏ.ఖాజా, గుండ్లూరు రఫీ, ఎంఎస్.సలీం, రహీం, నూర్ మొహిద్ధీన్ ఖాన్, యూనస్‌ఖాన్, ముజీబుద్ధీన్, రహంతుల్లా, షఫీ, తాజ్, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నిసార్‌అహ్మద్