ఎర్రగుంట్ల(జమ్మలమడుగు) : ఎర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామంలో ఓ వ్యాపారస్థుడు ఐపీ పెట్టడంతో అప్పులు ఇచ్చిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యాపారులు ఉన్నట్లుండి ఐపీ నోటీసులకు కోర్టు ద్వారా పంపించడంతో బాధితులందరూ శుక్రవారం ఎర్రగుంట్ల పోలీసు స్టేషన్‌కు చేరి తమకు న్యాయం చేయాలంటూ పోలీసుల ముందు వాపోయారు. చిలంకూరు గ్రామంలో నమ్మకంగా ఉన్న వ్యాపారస్థుడు ప్రజల వద్ద నుంచి అధిక వడ్డీకి దాదాపు మూడు కోట్లకుపైగా అప్పుగా తీసుకున్నాడు. దానిని చెల్లించలేని పరిస్థితి అప్పులు ఇచ్చిన వారికి కోర్టు ద్వారా ఐపీ నోటీసులు ఇవ్వడంతో బాధితులు ఒక్కసారిగా అవాకై ్కపోతున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
బద్వేలు అర్బన్ : పట్టణంలోని సిద్దవటం రోడ్డులోని లైఫ్‌స్టైల్ రెడీమేడ్స్ పక్క సందులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న అర్బన్ ఎస్‌ఐ సత్యనారాయణ పంచనామా నిర్వహించగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతుడు సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్‌లైతే అర్బన్ పోలీసులను సంప్రదించాలని కోరారు.
కారు ప్రమాదంలో యువకుడు మృతి – ముగ్గురికి తీవ్ర గాయాలు
సింహాద్రిపురం : మండల కేంద్రమైన సింహాద్రిపురం సమీపంలోని నిడివెల్ల గ్రా మం వద్ద గురువారం రా త్రి జరిగిన కారు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ రవికుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపురంలోని బంధువుల ఇంటికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా సింహాద్రిపురం మండలం నిడివెల్ల గ్రామ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడిందన్నారు. ప్రమాదంలో యువకుడు వెంకటసాయి మృతి చెందగా, మణిదీప్, శివచంద్ర, వేణులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించామన్నారు. గాయపడ్డ వేణు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
లారీని ఆపబోయి కారు డ్రైవర్‌కు గాయాలు
కొండాపురం : మండల పరిధిలోని ముచ్చుమర్రి గ్రామ సమీపంలోని తాడిపత్రి– ముద్దనూరు ఎన్‌హెచ్–67 రోడ్డుపై శుక్రవారం కొండాపురం గ్రామానికి బోడోల్ల పెద్దన్న ద్విచక్ర వాహనంపై వెళుతుండగా లారీ కంటైనర్ ఢీ కొని వెళ్లిపోతోంది. దీనిని వెనుక వస్తున్న కారు డ్రైవర్ గమనించి లారీని ఆపడం కోసం ప్రయత్నించి గాయలపాలయ్యాడు. కడప వైపు నుంచి తాడిపత్రి వైపునకు వెళ్తున్న కారు డ్రైవర్ పసుపులేటి రమణరెడ్డి లారీ కంటైనర్ ఆపడానికి ప్రయత్నించగా పి. అనంతపురం సమీపలోని కణం వద్ద ఉన్న ఎస్సీ కాలనీ దగ్గర కారును లారీ కంటైనర్ ఢీ కొట్టడంతో కారు పల్టీ కొట్టింది. ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్లు ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.