
ప్రభుత్వ వైద్యులకు భద్రత కల్పించాలి
పీలేరు : ప్రభుత్వ వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వం భద్రత కల్పించాలని భారతీయ వైద్యుల సంఘం (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నందకిషోర్, కార్యదర్శి డాక్టర్ సుభాష్‌చంద్రబోస్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ సేవకుమార్ కోరారు. శనివారం పీలేరు ఏరియా ఆస్పత్రిని వారు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త ఆసుపత్రుల అనుమతులు, పాత ఆసుపత్రుల అనుమతుల రెన్యువల్ ప్రాసెస్ సులభతరం చేయాలని కోరారు. మిక్సోపతిని ప్రోత్సహించాలని, అల్లోపతి వైద్య విధానంలోకి మిగిలిన వైద్య విధానాలను కలపకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ చంద్రశేఖర్, పీలేరు శాఖ అధ్యక్షుడు డాక్టర్ మమతా లక్ష్మి, కార్యదర్శి డాక్టర్ పవన్‌కుమార్, కోశాధికారి డాక్టర్ ఈశ్వర సురేంద్ర, డాక్టర్ రాజాసాహెబ్, డాక్టర్ శ్రీనివాసగుప్తా, డాక్టర్ నాగవేణి, డాక్టర్ శివయ్య, డాక్టర్ రూపేష్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ హరి, డాక్టర్ చంద్రశేఖర్‌నాయక్, డాక్టర్ అలీమ్ పాల్గొన్నారు.