ఈ రాశి వారికి పనులు విజయవంతమవుతాయి. ఆర్థికాభివృద్ధి | Today Telugu Horoscope On December 14th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి పనులు విజయవంతమవుతాయి. ఆర్థికాభివృద్ధి

Published Sat, Dec 14 2024 5:28 AM | Last Updated on Sat, Dec 14 2024 10:10 AM

Daily Horoscope On 14th December 2024 In Telugu

  గ్రహం అనుగ్రహం:  శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: శు.చతుర్దశి సా.4.20 వరకు తదుపరి పౌర్ణమి, నక్షత్రం: రోహిణి తె.4.18 వరకు (తెల్లవారితే ఆదివారం) తదుపరి మృగశిర, వర్జ్యం: రా.8.43 నుండి 9.12 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.24 నుండి 7.53 వరకు, అమృతఘడియలు: రా.1.17 నుండి 2.46 వరకు.

సూర్యోదయం :    6.25
సూర్యాస్తమయం    :  5.24
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. అనారోగ్య సూచనలు. మిత్రులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం: పనులు విజయవంతమవుతాయి. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల ఆప్యాయత పొందుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మిథునం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కర్కాటకం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. సంఘంలో గౌరవం. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం: కొత్త పరిచయాలు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అన్నీ విజయాలే.

కన్య: బంధువర్గంతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఒప్పందాలలో జాప్యం. వ్యాపారాల విస్తరణ నిలిచిపోతుంది. ఉద్యోగాలలో మరింత పనిభారం.

తుల: మిత్రులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. స్థిరాస్తి వివాదాలు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చికం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. ఇంటాబయటా అనుకూలత. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత తొలగుతాయి.

మకరం: కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బా«ధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్నిసమస్యలు.

కుంభం: కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండక ఇబ్బందిపడతారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.

మీనం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. కుటుంబసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వృద్ధి కనిపిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement