శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.నవమి సా.4.20 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: పునర్వసు రా.3.48 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ప.3.41 నుండి 5.17 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.41 వరకు, తదుపరి ప.2.42 నుండి 3.30 వరకు, అమృత ఘడియలు: రా.1.32 నుండి 3.10 వరకు.
మేషం: ముఖ్య కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. ధన, వస్తులాభాలు. పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో నిరాశాజనకంగా ఉంటుంది.
మిథునం: శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. సంఘంలో విశేష గౌరవం. భూలాభాలు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
కర్కాటకం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
సింహం: కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ధనలాభం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహ్నానిస్తాయి.
కన్య: శుభవార్తలు వింటారు. భూవివాదాలు తీరతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
తుల: బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృశ్చికం: రాబడికి మించి ఖర్చులు. వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
ధనుస్సు; ఇంటిలో సమస్యల పరిష్కారం. ఆర్థికాభివృద్ధి. యత్నకార్యసిద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.
మకరం: పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.
కుంభం: పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. మిత్రులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మీనం: చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ తప్పదు. వ్యాపారాలలో స్వల్పలాభాలు. ఉద్యోగులకు మార్పులు.
Comments
Please login to add a commentAdd a comment