శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.దశమి సా.4.17 వరకు తదుపరి ఏకాదశి, నక్షత్రం: పుష్యమి తె.4.39 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి ఆశ్లేష, వర్జ్యం: ప.12.06 నుండి 1.42 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.17 నుండి 1.05 వరకు, అమృత ఘడియలు: రా.10.10 నుండి 11.48 వరకు.
సూర్యోదయం : 5.53
సూర్యాస్తమయం : 5.52
రాహుకాలం : ఉ.10.30
నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం: పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలలో నిరాశ. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులు మీ నిర్ణయాలను తిరస్కరిస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
వృషభం: ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మిథునం: మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో కొంత గందరగోళం. ఉద్యోగాలలో మార్పులు.
కర్కాటకం: నిరుద్యోగులకు అనుకూలత. యత్నకార్యసిద్ధి. దూరపు బంధువుల కలయిక. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
సింహం: ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. విద్యార్థులకు కొంత నిరాశ. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
కన్య: కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. దైవదర్శనాలు.
తుల: నూతన ఉద్యోగలాభం. కార్యజయం. ఆస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
వృశ్చికం: రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబంలో చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమాధిక్యం. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు.
ధనుస్సు: రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. పనులు వాయిదా వేస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వ్యవహారాలలో విజయం. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు ప్రగతి పథంలో సాగుతాయి.
కుంభం: యత్నకార్యసిద్ధి. బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
మీనం: కుటుంబసభ్యులతో వైరం. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో నిరాశ.
Comments
Please login to add a commentAdd a comment