
శ్రీశార్వరినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.పంచమి రా.9.33 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం చిత్త రా.10.14 వరకు తదుపరి స్వాతి వర్జ్యం తె.3.26 నుంచి 4.56 వరకు(తెల్లవారితే సోమవారం) దుర్ముహూర్తం సా.4.17 నుంచి 5.46 వరకు అమృతఘడియలు...సా.4.15 నుంచి 5.54 వరకు
రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు
సూర్యోదయం 5.47
సూర్యాస్తమయం 6.18
రాశిఫలం:
మేషం: సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలు పరిష్కరించకుంటారు. ధనప్రాప్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు పొందుతారు.
వృషభం: యత్నకార్యసిద్ధి. ప్రముఖుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.
మిథునం: కొన్ని పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమాధిక్యం. అనారోగ్యం. మిత్రులతో స్వల్ప తగాదాలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో పనిభారం.
కర్కాటకం: కొత్త విషయాలు తెలుస్తాయి. పనులు పెండింగ్‌లో పడతాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
సింహం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. ఆసక్తికర సమాచారం. వ్యాపారాలు అభివృద్ధిలో ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
కన్య: కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యసమస్యలు. పనులలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
తుల: ఆస్తిలాభం. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. కొత్త పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించినరీతిలో ఉంటాయి.
వృశ్చికం: పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు కొంత చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
ధనుస్సు: కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. పనులు చకచకా పూర్తి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త విధులు.
మకరం: ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వస్తు,వస్త్రలాభాలు. యత్నకార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.
కుంభం: పనిఒత్తిడులు. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆలయ దర్శనాలు. కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. రుణయత్నాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాల విస్తరణ ముందుకు సాగదు. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment