శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: బ.త్రయోదశి సా.6.59 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: మఖ ఉ.7.46 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: సా.4.31 నుండి 6.15 వరకు, దుర్ముహూర్తం: ప.12.15 నుండి 1.03 వరకు, తదుపరి ప.2.39 నుండి 3.27 వరకు, అమృతఘడియలు: రా.2.56 నుండి 4.43 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.53, సూర్యాస్తమయం: 5.49.
మేషం: రుణఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు.
వృషభం: కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. పనులు శ్రమానంతరం పూర్తి. ఆరోగ్యభంగం. విద్యార్థులకు శ్రమ తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
మిథునం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.
కర్కాటకం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. కుటుంబసభ్యుల నుంచి కొద్దిపాటి ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళం. ధనవ్యయం.
సింహం: కోరుకున్న ఉద్యోగాలు లభిస్తాయి. పనులలో విజయం. బంధువర్గం నుంచి శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు
కన్య: శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. పనుల్లో అవాంతరాలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. దైవదర్శనాలు.
తుల: కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు తొలగుతాయి. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యవహారాలలో విజయం. బంధువుల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుటారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
ధనుస్సు: పనులు నెమ్మదిస్తాయి. దూరప్రయాణాలు. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా ఒత్తిళ్లు.
మకరం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. దైవచింతన.
కుంభం: కొత్త పనులు చేపడతారు. సోదరుల నుంచి కీలక సమాచారం. ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి.
మీనం: కుటుంబంలో ఉత్సాహం.. విలువైన సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. విందువినోదాలు.
Comments
Please login to add a commentAdd a comment