ఈ రాశి వారికి ధనలాభం, వస్తులాభాలు | Horoscope Today: Rasi Phalalu October 13 In Telugu | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి ధనలాభం, వస్తులాభాలు

Published Sun, Oct 13 2024 6:46 AM | Last Updated on Sun, Oct 13 2024 8:26 AM

Horoscope Today: Rasi Phalalu October 13 In Telugu

మేషం....  శుభవార్తలు అందుతాయి. సోదరులు, బంధువుల నుంచి ధనలాభం. సమాజసేవలో పాల్గొంటారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి.

వృషభం...ఒక సమస్య నుంచి బయటపడతారు. రావలసిన డబ్బు అందుతుంది.  కొత్త పనులు చేపడతారు. శుభవార్తలు వింటారు. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో మరింత సానుకూలత.

మిథునం....కుటుంబసభ్యులతో విభేదాలు. పనుల్లో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కొత్తగా రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.  అనారోగ్యం.

కర్కాటకం...వ్యవహారాలలో అవాంతరాలు.  మిత్రులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. శ్రమకు ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

సింహం....పాతమిత్రుల కలయిక. సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు కొంటారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

కన్య... కొత్త విషయాలు తెలుస్తాయి. కొన్ని వివాదాలలో పరిష్కారం దొరుగుతుంది. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు పైచేయి సాధిస్తారు.

తుల...రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ధనవ్యయం.

వృశ్చికం... శ్రమాధిక్యం. కొన్ని  పనులు మధ్యలో వాయిదా. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

ధనుస్సు...పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. ఆలయ దర్శనాలు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.

మకరం...వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. బంధువర్గం నుంచి విమర్శలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కుంభం...శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్య పరిష్కారం. సోదరులు, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మీనం...పనుల్లో ప్రతిబంధకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement