
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం,
సూర్యోదయం 6.08; సూర్యాస్తమయం 5.21.
తిథి: బ.సప్తమి రా.2.18 వరకు, తదుపరి అష్టమి,
నక్షత్రం: పుష్యమి ప.2.06 వరకు, తదుపరి ఆశ్లేష,
వర్జ్యం: తె.4.10 నుండి 5.56 వరకు (తెల్లవారితే బుధవారం),
దుర్ముహూర్తం: ఉ.8.21 నుండి 9.06 వరకు, తదుపరి రా.10.27 నుండి 11.17 వరకు,
అమృతఘడియలు: ఉ.7.01 నుండి 8.45 వరకు;
రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు;
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు;
మేషం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యభంగం.
వృషభం: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
మిథునం: వ్యయప్రయాసలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆరోగ్యభంగం. విద్యార్థులకు కొంత నిరాశ.. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.
కర్కాటకం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనయోగం. వృత్తి,వ్యాపారాలలో పురోగతి.
సింహం: రుణాలు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యభంగం. ప్రయాణాలు.
కన్య: దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
తుల: పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా ఉంటాయి.
వృశ్చికం: ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. ధనవ్యయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. నిరుద్యోగులకు నిరాశాజనకం. మానసిక ఆందోళన.
ధనుస్సు: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. శ్రమాధిక్యం. నిరుద్యోగులకు ఒత్తిడులు.
మకరం: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వాహనసౌఖ్యం. విలువైన సమాచారం అందుతుంది. పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో గౌరవం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కుంభం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం.
మీనం: ఆర్థిక ఇబ్బందులు. ఊహించని ప్రయాణాలు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. బంధువుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. దైవచింతన.
Comments
Please login to add a commentAdd a comment