
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బ.చవితి ఉ.8.02 వరకు తదుపరి పంచమి, నక్షత్రం శ్రవణం ప.1.04 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం సా.4.47 నుండి 6.20 వరకు దుర్ముహూర్తం ఉ.5.31 నుండి 7.15 వరకు అమృతఘడియలు... రా.1.52 నుండి 2.34 వరకు.
సూర్యోదయం : 5.30
సూర్యాస్తమయం : 6.32
రాహుకాలం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుంచి 3.00 వరకు
మేషం....చిరకాల మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి. విందువినోదాలు.
వృషభం....ఆర్థిక ఇబ్బందులు. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు.ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో మార్పులు.
మిథునం....ప్రయాణాలు వాయిదా వేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యసమస్యలు. పనుల్లో జాప్యం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో గందరగోళం.
కర్కాటకం...కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూలత. వాహనయోగం.
సింహం....కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. అనుకోని ఆహ్వానాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కన్య....ప్రయాణాలు . ఆరోగ్య, కుటుంబసమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. దైవదర్శనాలు చేసుకుంటారు.
తుల....ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో ఒత్తిడులు. దేవాలయ దర్శనాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.
వృశ్చికం...కొత్త పనులు చేపడతారు. ఆకస్మిక ధనలాభం. ఆస్తి వివాదాలు తీరతాయి. కళాకారులకు పదవీయోగం. వస్తులాభాలు. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో పురోగతి.
ధనుస్సు...వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
మకరం....చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కుంభం....పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు.వ్యాపారాలు అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు.
మీనం...ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు తథ్యం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం.
Comments
Please login to add a commentAdd a comment