
శ్రీ ప్లవనామ సంవత్సరం. ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. తిథి శు.చతుర్దశి ప.1.12 వరకు, తదుపరి పౌర్ణమి. నక్షత్రం పుబ్బ రా.12.41 వరకు, తదుపరి ఉత్తర. వర్జ్యం ఉ.8.09 నుండి 9.46 వరకు. దుర్ముహూర్తం ఉ.10.11 నుండి 10.56 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు. అమృత ఘడియలు సా.6.02 నుండి 7.56 వరకు
సూర్యోదయం : 6.12
సూర్యాస్తమయం : 6.06
రాహుకాలం : ప. 1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు:
మేషం....చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు అధికమవుతాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
వృషభం....సన్నిహితులు, మిత్రులతో అకారణ వైరం. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మిథునం...కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త మార్పులు.
కర్కాటకం...కుటుంబంలో చికాకులు. పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారవచ్చు.
సింహం....పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో గౌరవం. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
కన్య...సన్నిహితులతో మాటపడతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
తుల...నూతన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
వృశ్చికం...సన్నిహితులతో సఖ్యత. శుభవర్తమానాలు. అదనపు ఆదాయం. వ్యవహారాలలో విజయం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పైచేయిగా ఉంటుంది.
ధనుస్సు....కుటుంబంలో లేనిపోని సమస్యలు. రుణయత్నాలు. స్వల్ప అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.
మకరం....మిత్రులు ఒత్తిడులు పెంచుతారు. అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.
కుంభం...కష్టానికి ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తుల విషయంలో ఒప్పందాలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మీనం...అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు కొంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
Comments
Please login to add a commentAdd a comment