శ్రీ ప్లవ నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి బ. పంచమి ఉ.10.36 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం కృత్తిక ప.1.27 వరకు తదుపరి రోహిణి, వర్జ్యం... లేదు దుర్ముహూర్తం సా.4.17 నుండి 5.04 వరకు, అమృతఘడియలు... ఉ.10.47 నుండి 12.32 వరకు.
సూర్యోదయం : 5.52
సూర్యాస్తమయం : 5.53
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
రాశి ఫలాలు:
మేషం.... పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో కలహాలు. అనారోగ్య సూచనలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.
వృషభం... యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
మిథునం... వ్యయప్రయాసలతో పనులు పూర్తి. బంధువులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కర్కాటకం.... సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు.
సింహం... పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
కన్య... దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
తుల.... వ్యవహారాలు నిదానిస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.
వృశ్చికం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ఊహలు నిజం చేసుకుంటారు.
ధనుస్సు.. బాకీలు వసూలవుతాయి. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఆస్తిలాభం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.
మకరం.... వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కుంభం... ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్య సూచనలు. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
మీనం.... కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. ఉద్యోగయోగం.
Comments
Please login to add a commentAdd a comment