
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వాహనయోగం. రావలసిన బాకీలు అందుతాయి. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. నేరేడు, లేత ఎరుపు రంగులు, శివాష్టకం పఠించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పనులలో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే సూచనలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో కుటుంబసభ్యులతో తగాదాలు. వృథా ఖర్చులు. గులాబీ, తెలుపు రంగులు, పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి.
మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థులకు కొత్త ఆశలు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఎరుపు, బంగారురంగులు, శివపంచాక్షరి పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. అనారోగ్యం. పసుపు, తెలుపురంగులు, గణేశాష్టకం పఠించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. తండ్రి తరఫు వారి నుంచి ధనలాభాలు ఉంటాయి. శ్రేయోభిలాషుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో బంధువుల నుండి సమస్యలు. మానసిక అశాంతి. తెలుపు, చాక్లెట్ రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కవచ్చు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లకు అవకాశం. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో దూరప్రయాణాలు. ఎరుపు, బంగారు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు సాదాసీదాగా ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. సోదరులు, మిత్రులతో కొద్దిపాటి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. విలువైన వస్తువులు చేజారతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. కళాకారులు, రాజకీయవేత్తలకు అవకాశాలు నిరాశ కలిగించవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. శ్రమ కొలిక్కి వస్తుంది. చాక్లెట్, ఆకుపచ్చరంగులు, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
చేపట్టిన ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఒక సంఘటన మీలో మార్పు తెచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. పారిశ్రామికవర్గాలకు వ్యూహాలు ఫలిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. గులాబీ, తెలుపు రంగులు. సూర్యాష్టకం పఠించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ప్రస్తుత పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆలోచనలు అమలులో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తుల వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. హనుమాన్ చాలీసా పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు మీకు మరింత సహాయపడతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. నూతన ఉద్యోగాన్వేషణలో ముందడుగు వేస్తారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారి కృషి కొంత ఫలిస్తుంది. వారం చివరిలో ధనవ్యయం. నీలం, ఆకుపచ్చ రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
శ్రమ ఫలించే సమయం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో రాజీపడతారు. చర, స్థిరాస్తుల వృద్ధి. కుటుంబంలో శుభకార్యాలు. విద్యార్థులకు ఉత్సాహం పెరుగుతుంది. వాహనయోగం. చర్చల్లో పురోగతి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయ, కళారంగాల వారికి అనుకోని అవకాశాలు. సన్మానయోగం. చాక్లెట్, ఆకుపచ్చ రంగులు, కనకధారాస్తోత్రాలు పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొన్ని పనులు సకాలంలో పూర్తి చేసి ఊరట చెందుతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. విద్యార్థుల కృషి కొంత ఫలిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాల విస్తరణలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. నీలం, నేరేడు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.