
పురుగుమందుల పెట్టెలను పరిశీలిస్తున్న విజిలెన్స్ డీఎస్పీ
నగరంపాలెం: నగరంలోని పలు ట్రాన్స్‌పోర్టు పార్సిల్ కార్యాలయాల్లో మంగళవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ కె.ఈశ్వరరావు ఆదేశాల మేరకు వివిధ పార్సిల్ కంపెనీల వాహనాలలో వాటిని తరలించి, నిల్వ చేసి లైసెన్స్ లేకుండా అక్రమంగా విక్రయించే వాటిపై విస్తృతంగా సోదాలు చేపట్టారు. వీఆర్‌ఎల్ పార్సిల్ కార్యాలయంలో అనుమతుల్లేని 200 లీటర్ల పురుగుమందులను గుర్తించారు. వాటిపై అమరావతిలో తయారు చేసినట్లు స్టిక్కర్లు అతికించారు. పసుపులేటి ఆంజనేయ ప్రసాద్ పేరుతో పార్సిల్ రాగా, అతనికి ఎటువంటి లైసెన్స్, అనుమతుల్లేవని నిర్ధారించారు. వివిధ మార్గా ల్లో పురుగుమందులను తీసుకువచ్చి అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో తేలింది. రూ.1.68 లక్షల విలువైన 200 లీటర్లను సీజ్ చేసి, ‘6ఎ’, క్రిమినల్ కేసులు నమోదుకు ఆదేశించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారిణి జె.వాసంతి, సీఐలు ఎ.శ్రీహరిరావు, టి.లక్ష్మారెడ్డి, తహసిల్దార్ కె.నాగమల్లేశ్వర రావు, ఎస్‌ఐ ఎం.రామచంద్రయ్య, వ్యవసాయ అధికార, సిబ్బంది పాల్గొన్నారు.
200 లీటర్ల పురుగు మందులు సీజ్
Comments
Please login to add a commentAdd a comment