
యువతను మోసం చేసిన చంద్రబాబు
బాపట్లటౌన్: ఎన్నికలకు ముందు నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలుత ఈనెల 12న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే యువత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. నాగార్జున మాట్లాడుతూ పేద విద్యార్థులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఐదు త్రైమాసిక ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పెండింగ్‌లో పెట్టి రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోతున్నా సర్కార్ చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్ పథకాన్ని నాడు వైఎస్సార్ ప్రవేశపెడితే ఆ పథకాన్ని మరో మూడు అడుగులు ముందుకు వేసి అమలుచేసిన ఘనుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో విద్యాదీవెనకు రూ.12,609 కోట్లు ఖర్చుచేశారన్నారు. వీటితోపాటు వసతి దీవెనకు మరో రూ.6 వేల కోట్లు ఖర్చుచేశారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, లేకుంటే ప్రతి నెలా నిరుద్యోగులకు రూ.3 వేలు అందజేస్తామని నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయాలంటే బడ్జెట్‌లో రూ.7200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని కనీసం బడ్జెట్‌లో ప్రవేశపెట్టకపోవడం దారుణమన్నారు. పేదల ఆరోగ్యాన్ని మెరుగుపర్చాలనే సదుద్దేశంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాలను తీసుకువస్తే వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. కూటమి పాలనలో పేద విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం విద్య, ట్యాబ్‌ల పంపిణీ, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద లాంటి పథకాలు దూరమయ్యాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆశ్వినిరెడ్డి, జిల్లా యువత విభాగం అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు ఈదా శ్రీనివాసరెడ్డి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు వాసు, మైనర్జీవిభాగం జిల్లా అధ్యక్షులు జపరున్నీసా, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు, జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య, జిల్లా ప్రచారకమిటీ అధ్యక్షులు వడ్డిముక్కల డేవిడ్, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ గవినికృష్ణమూర్తి పాల్గొన్నారు.
12న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో
యువతపోరు
కార్యక్రమాన్ని
విజయవంతం చేయాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు
మేరుగ నాగార్జున
Comments
Please login to add a commentAdd a comment