ఏఎన్‌ఎంలపై పనిఒత్తిడి తగ్గించాలి
బాపట్ల: ఏఎన్‌ఎంలపై పని ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.రోశయ్య పేర్కొన్నారు. బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో అసోసియేషన్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో కె.రోశయ్య మాట్లాడుతూ తాలుకా, జిల్లా బాడీలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. 143 జీఓని రద్దు చేయాలని కోరారు. ఏఎన్‌ఎంలపై ఒత్తిడి తగ్గించాలని, గ్రేడ్ 3 ఏఎన్‌ఎంలను వైద్యశాఖలోకి తీసుకోవాలని కోరారు. పీ4 సర్వేలో ఏఎన్‌ఎంలను మినహాయించాలన్నారు. సమావేశంలో నాయకులు సీహెచ్ బెనర్జీ, జె.సుధాకర్, ఎన్.సుబ్బారావు, కె.మారుతి ప్రసాద్, రత్నకుమారి, రమణమ్మ, సైదయ్య, వేణు, మహబూబ్, రాజేష్, బాపట్ల టౌన్ అధ్యక్షుడు జి.శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.రోశయ్య
Comments
Please login to add a commentAdd a comment