బాపట్ల
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025
ప్రభువుకు కృతజ్ఞతా స్తుతులతో రక్షణ
విజయపురిసౌత్: ‘‘ఏసు ప్రభువునకు ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట రక్షణదాయకమ’’ని గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగ్యయ్య అన్నారు. సాగర్‌మాత మహోత్సవం ముగింపు రోజైన ఆదివారం నిర్వహించిన సమష్టి దివ్య బలి పూజలో ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. పవిత్రాత్మ ప్రభావం వల్ల కన్నె మరియమాత గర్భాన దివ్యజ్యోతి అయిన ఏసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించినట్లు పేర్కొన్నారు. పవిత్రమైన ఏసుక్రీస్తును దీనభావంతో స్తుతించాలని తెలిపారు. ఆధ్యాత్మిక ఆయుధాలైన ప్రార్థన, ప్రేమ, నీతి, కరుణ, దయ, క్షమాగుణం కలిగిన వ్యక్తులు దేవుని మార్గంలో నడిపింపబడుతున్నారని అర్థం అని పేర్కొన్నారు. సాగర్‌మాత మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు దేవుడు ఐశ్వర్య, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థించారు.
రథోత్సవంతో ఉత్సవాలు ముగింపు
ఆదివారం రాత్రి సాగర్ మాత రథోత్సవం ప్రధానమైంది. ఈ ఊరేగింపుతో ఉత్సవం ముగుస్తుంది. ఉదయం 5గంటలకు అత్తలూరు విచారణ గురువులు చాట్ల కస్సార్, 6గంటలకు కారంపూడి విచారణ గురువులు పెట్ల మర్రి అనిల్, 7గంటలకు ముట్లూరు విచారణ గురువులు మార్నేని దిలీప్, 8గంటలకు దాచేపల్లి విచారణ గురువులు గురుశ్రీ ఏరువ బాలశౌర్రెడ్డి, ఉదయం 10.30 గంటలకు గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగయ్య సమష్టి దివ్య పూజలు నిర్వహించారు. పామిశెట్టి తోమస్ బృందం గానం ఆకట్టుకుంది. ఫాదరన్లు జోసఫ్ బాలసాగర్, తంబి, మనోజ్‌కుమార్, ఆలయ పెద్దలు ఎం. జోషి, జెక్కిరెడ్డి చిన్నపరెడి, డి. ఇన్నారెడ్డి, కె. శౌర్రాజు, మరియదాసు, శౌరిబాబు, బాలస్వామి పాల్గొన్నారు.
ఇఫ్తార్ సహర్
(సోమ) (మంగళ)
బాపట్ల 6.22 5.03
గుంటూరు 6.22 5.03
నరసరావుపేట 6.24 5.05
సాక్షి ప్రతినిధి,బాపట్ల: దశాబ్దాలపాటు కలిసి కాపురంచేస్తామని ఇటు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అటు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌లు పదేపదే చెప్పినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. చాలాచోట్ల పచ్చనేతలు, జనసేన కార్యకర్తలకు మధ్య సమన్వయంలేదు. కొన్ని చోట్ల ఒకరంటే మరొకరికి గిట్టడంలేదు. ఇంకొన్నిచోట్ల ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రధానంగా బాపట్ల జిల్లాలోని పర్చూరు, అద్దంకి, బాపట్ల, వేమూరులాంటి నియోజకవర్గాల్లో చంద్రబాబు సామాజికవర్గంతో పోలిస్తే జనసేన అధినేత సామాజికవర్గం తక్కువ జనాభా, ఓటర్లను కలిగి ఉండడంతో పచ్చపార్టీ నేతలు వారిని ఖాతరు చేయడంలేదు. తాజాగా పర్చూరు ఇందిరా నగర్–7 చౌకదుకాణం పంచాయతీ పచ్చపార్టీ, జనసేనల మధ్య చిచ్చురేపి హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు తలకు చుట్టుకోగా జనసేన ఫిర్యాదుతో అటు పచ్చపార్టీ అధిష్టానానికి సైతం చేరినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. నియోజకవర్గ కేంద్రమైన పర్చూరులోని ఇందిరానగర్–7 చౌక దుకాణానికి 2000 సంవత్సరం నుంచి నవత డీలర్‌గా ఉన్నారు. భర్త మృతి చెందగా డీలర్‌షిప్పును నడుపుకొంటూ పిల్లలను పోషించుకుంటున్నారు. పవన్‌కళ్యాణ్ మీద అభిమానంతో నవత కుటుంబం జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీతోనే ఉన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనూ ఆమె డీలర్‌గా కొనసాగారు. కూటమి అధికారంలోకి రాగానే స్థానిక పచ్చనేత సదరు డీలర్‌షిప్పు కొట్టేసేందుకు పెద్ద ప్లాన్ వేశారు.
మండిపడుతున్న జనసేన శ్రేణులు..
ఎన్నికల్లో టీడీపీకి ఓట్లేసి గెలిపిస్తే 25 ఏళ్లుగా డీలర్‌గా నవతను వితంతు అని కూడా చూడకుండా టీడీపీ నాయకుడు స్వయంగా అధికారులకు పట్టించి తొలగించడంపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. డీలర్ తనయుడు జనసేన కీలక నాయకుడుగా ఉన్నారు. పర్చూరు నియోజకవర్గంలో పవన్‌కల్యాణ్ సామాజికవర్గం ఓటర్లు 20 వేలకు పైగా ఉన్నాయి. ఇప్పుడు వారంతా పచ్చపార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. అటు జనసేన అధిష్టానానికి విషయం చేరవేసినట్లు సమాచారం. దీంతో సమస్య పచ్చపార్టీ అధిష్టానానికి సైతం చేరినట్లు తెలుస్తోంది. మొత్తంగా చౌకదుకాణం వ్యవహారం ఇప్పుడు పర్చూరు కూటమిలో చిచ్చురేపింది.
7
పర్చూరులో టీడీపీ, జనసేన మధ్య విబేధాలు ప్లాన్ చేసి జనసేనకు చెందిన డీలర్‌కు చెక్ పెట్టిన పచ్చనేత లారీకి తక్కువ వచ్చాయని చౌకబియ్యం సేకరణ నమ్మి బియ్యం అమ్మిన ఇందిరానగర్–7 రేషన్ డీలర్ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో దాడిచేయించిన పచ్చనేత కేసుకు భయపడి రాజీనామా చేసిన డీలర్ నవత కూటమి అధికారంలోకి రాగానే డీలర్ షిప్ కొట్టేసేందుకు పావులు కదిపిన దందా నిర్వహకుడు టీడీపీ నేత పన్నాగాన్ని జనసేన డీలర్ చెవిన వేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి పచ్చనేత దురాగతంపై జనసేన నేతల ఆగ్రహం
న్యూస్‌రీల్
వ్యూహం పన్నారు.. పట్టించారు..
పర్చూరులో చౌకబియ్యం దందా నిర్వహించే సుమన్ బియ్యం లోడుకు తక్కువగా ఉన్నాయని, మీవద్దవున్న మొత్తం బియ్యం ఇవ్వాలంటూ డీలర్ నవతపై ఒత్తిడి పెట్టారు. 15వ తేదీ తర్వాత బియ్యం ఇస్తామని, ముందుగా ఇస్తే అధికారులతో సమస్య అవుతుందని నవత కుటుంబం చెప్పింది. అంతా తాను చూసుకుంటానని, అధికారుల భయంలేదని సుమన్ భరోసా మాటలు చెప్పారు. అసలే పచ్చనేతల దందా.. బియ్యం ఇవ్వకపోతే అదోతంటా ఎందుకని నవత కుటుంబం ఈ నెల 6వ తేదీన దందా నిర్వాహకుడు సుమన్‌కు తమవద్దవున్న రేషన్‌బియ్యం అప్పగించారు. 7వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నవత చౌకదుకాణంపై దాడిచేశారు. బియ్యంలేవని నిర్దారించుకొని కేసు కట్టాలా? రాజీనామా చేస్తారా? అంటూ బెదిరించారు. ఇదే సమయంలో బియ్యం దందా నిర్వాహకుడు సుమన్‌కు డీలర్ ఫోన్‌చేశారు. అక్కడికి వచ్చిన సుమన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను పక్కకు తీసుకెళ్లి మాట్లాడి అధికారులు తన మాట వినడంలేదని, మీరే మాట్లాడుకోవాలని డీలర్‌కు చెప్పి అక్కడినుంచి జారుకున్నాడు. వాస్తవానికి బియ్యం లెక్కల్లో తేడాలొస్తే ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేయాలి. కానీ పచ్చనేత ఒత్తిడితో అలా అలా చేయకుండా కేసులు కడితే కోర్టుచుట్టూ తిరగాల్సి వస్తుందని, మహిళగా ఉండి కోర్టుకు వెళ్లడం సరికాదని, రాజీనామా చేయడమే మంచిదని నవతను బెదిరించారు. అధికారుల ఒత్తిడి భరించలేక నవత అదేరోజు డీలర్ పదవికి రాజీనామా చేశారు. తాము చెప్పగానే రాజీనామా చేసిన నవతపై సానుభూతి చూపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెళుతూ వెళుతూ పచ్చనేత ఒత్తిడితోనే తాము వచ్చామని, మీరు బియ్యం అమ్మిన విషయం చెప్పి పట్టించింది అతనేనంటూ అసలు విషయం ఆమెకు చెప్పి జారుకున్నారు.
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
Comments
Please login to add a commentAdd a comment