సందడిగా సినిమా పాటల పోటీలు ప్రారంభం
సత్తెనపల్లి: చైతన్య కళా స్రవంతి 46వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫంక్షన్ హాలులో ఆదివారం జాతీయస్థాయి సినిమా పాటల పోటీలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు హాజరయ్యారు. పోటీల్లో సోలో పాటలకు మాత్రమే అవకాశం కల్పించారు. డ్యూయెట్స్‌ను అనుమతించలేదు. ముందుగా చైతన్య కళా స్రవంతి వ్యవస్థాపక అధ్యక్షుడు పిల్లుట్ల రామారావు చిత్రపటానికి చైతన్య కళా స్రవంతి అధ్యక్షులు కమతం శ్రీనివాసరావు, సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పాటల పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త పోతుగంటి రామకోటేశ్వరరావు, చైతన్య కళా స్రవంతి ఉపాధ్యక్షులు పిల్లుట్ల రాజా వీరాస్వామి, ప్రధాన కార్యదర్శి గుండవరపు అమర్నాథ్, ట్రెజరర్ ఎస్‌సీఎం సుభాని, గౌరవ సలహాదారుడు ముట్లూరి వెంకయ్య, కంబాల వెంకటేశ్వరరావు, అచ్చిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment