వలంటీరు వ్యవస్థపై టీడీపీ ప్రకటన సిగ్గుచేటు
రేపల్లె రూరల్: వలంటీరు వ్యవస్థ లేదని, కొనసాగించబోమని శాసనమండలి సమావేశాల్లో రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయులు ప్రకటించడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవురు గణేష్ పేర్కొన్నారు. గుళ్లపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏరుదాటిన తర్వాత తెప్ప తగలబెట్టిన చందాన కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు వలంటీరు వ్యవస్థను కొనసాగించడంతోపాటు నెలకు రూ.10,000 వేతనం అందిస్తామని చంద్రబాబు నాయుడుతోపాటు ఇతర కూటమి నేతలు ప్రచారం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. తీరా గెలిచాక వలంటీర్లను మోసం చేశారన్నారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో వలంటీర్లు ప్రాణాలకు తెగించి చేసిన సేవలు మరువరదన్నారు. అవినీతికి తావు లేకుండా ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో వలటీర్ల పాత్ర కీలకం అన్నారు. వలంటీర్ల సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే అనేక సందర్భాలలో అభినందించారని గుర్తు చేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన వలంటరీ వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గణేష్
Comments
Please login to add a commentAdd a comment