
బస్సు ఢీకొని ఇద్దరు విద్యార్థులకు గాయాలు
నూజెండ్ల(శావల్యాపురం): నూజెండ్ల మండలం బుర్రిపాలెం గ్రామంలో ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు మేరకు.. మండల కేంద్రానికి సరైన రవాణా సౌకర్యం లేకపోవటంతో విద్యార్థుల తల్లిదండ్రుల అభీష్టం మేరకు ఇటీవల ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసు నడుపుతున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని విద్యార్థులను నూజెండ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలకు తీసుకొని వచ్చిన బస్సును రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యార్థులను ఢీకొంది. ఈ ప్రమాదంలో 6వ తరగతి విద్యార్థి కత్తి అఖిల్, 7వ తరగతి విద్యార్థి ఏటి అశోక్‌లకు గాయాలు అయ్యాయి. వీరిని 108 ద్వారాప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వినుకొండ వైద్యశాల్లో చికిత్స పొందుతున్న వారిని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ పరామర్శించారు. వైద్యాధికారితో మాట్లాడారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ఆర్టీసీ డ్రైవరు సమయస్ఫూర్తితో వ్యవహరించటంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment