రోడ్డు ప్రమాదాలను నివారించండి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్ జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రహదారులపై తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి 15రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. రోడ్ల మరమ్మతులు, ప్రమాదాల నియంత్రణకు చర్యలు తక్షణం ప్రారంభం కావాలని చెప్పారు. వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. గుంతల రహిత జిల్లా కోసం కృషి చేయాలని వివరించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదాలు జరిగితే తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే మార్చి 1 నుంచి రూ.1,000 జరిమానా విధిస్తామని చెప్పారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్‌ఈ శ్రీనివాసమూర్తి, జిల్లా ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి, జాతీయ రహదారుల పీడీ పార్వతీశం, పంచాయతీరాజ్ ఎస్‌ఈ బ్రహ్మయ్య, డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మి, ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరిండెంట్ అరుణ కుమారి, ఆర్టీఓలు సత్యనారాయణ ప్రసాద్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
బ్లాక్ స్పాట్లను గుర్తించండి అధికారులకు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment