ఎన్నికల కోడ్ ఉల్లంఘన
అమర్తలూరు (వేమూరు): గోవాడ శ్రీ బాల కోటేశ్వర స్వామి మహా శివరాత్రి తిరునాళ్లలో వివిధ పార్టీలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించాయి. అమర్తలూరు మండలంలో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలతో వస్తే కేసు నమోదు చేస్తామని రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరరావు ప్రకటించారు. కానీ బుధవారం రాత్రి జనసేన నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలతో ఊరేగింపు నిర్వహించారు. కోడ్ ఉల్లంఘించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసులేదని భక్తులు ఆరోపిస్తున్నారు.
రైతులకు సమస్యలు లేకుండా చూడండి
రీసర్వేలో జాయింట్ కలెక్టర్
బొల్లాపల్లి : జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే గురువారం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. పలు వివరాలను తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. రీసర్వే పనుల గురించి ఆరా తీశారు. మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న రీసర్వే పనుల్లో రెవెన్యూ శాఖ తరఫున ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు. తహసీల్దార్ ఏవీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
కాకాని ప్రభకు ప్రమాదం
నరసరావుపేట రూరల్: కాకాని విద్యుత్ ప్రభ ప్రమాదానికి గురైంది. కోటప్పకొండ తిరునాళ్ల నుంచి తిరుగు ప్రయాణంలో గురవాయపా లెం సమీపంలోని 10ఆర్ మేజర్ కాలువపై అ దుపుతప్పి నేలకొరిగింది. హైటెన్షన్ వైర్లను దా టించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. వెంట ఉన్న గ్రామస్తులు అప్రమత్తంగా ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. మరో క్రేన్ సా యంతో ప్రభను కాలువనుంచి బైటికి తీసి సి ద్ధం చేశారు. తర్వాత గ్రామానికి తరలించారు.
కనుల పండువగా తెప్పోత్సవం
నకరికల్లు: మండలంలోని నర్సింగపాడు గ్రామంలో గల గంగా అన్నపూర్ణా సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో తెప్పోత్సవం వేడుకలు గురువారం కనులపండువగా నిర్వహించారు. మహా శివరాత్రి వేడుకలను పురస్కరించుకొని ఆలయ అర్చకులు పమిడిమర్రు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. చల్లగుండ్ల గ్రామానికి చెందిన మడకా వెంకటేశ్వర్లు, రామతులసి, పొట్లవీడు గ్రామానికి చెందిన చుండూరు శివశంకర శ్రీనివాసరావు, వెంకట్రావమ్మల ఆధ్వర్యంలో తెప్పోత్సవం జరిపించారు. ఆలయంలోని కోనేటిని రంగురంగుల పూలతో అలంకరించారు. హంస వాహనంపై ఉత్సవమూర్తులు కొలువుదీరాయి. భక్తుల శివనామస్మరణల నడుమ తెప్పోత్సవం సాగింది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన
ఎన్నికల కోడ్ ఉల్లంఘన
ఎన్నికల కోడ్ ఉల్లంఘన
Comments
Please login to add a commentAdd a comment