బాపట్ల
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025
ఇఫ్తార్ సహరి
(సోమ) (మంగళ)
నరసరావుపేట 6.13 5.10
గుంటూరు 6.22 5.10
బాపట్ల 6.21 5.08
చీరాల: చేనేతలపై కూటమి ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ప్రదర్శించింది. బడ్జెట్ కేటాయింపులలో రిక్తహస్తం చూపింది. కేవలం 0.043 శాతం కేటాయింపులు చేసి కపట ప్రేమ చూపించింది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్యాయం చేసింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చేనేతలు వెన్నంటే ఉన్నారని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు వారి సంక్షేమానికి బడ్జెట్‌లో మాత్రం పైసా విదిల్చలేదు. రాష్ట్రంలో చేనేత మగ్గాలపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా చేనేత ఉప వృత్తుల వారితో కలిపి ఐదు లక్షల మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. నేడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చేనేత వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది.
కేటాయింపులు నిల్ ?
● చేనేతల ఆరోగ్య భద్రతను తన బాధ్యతగా స్వీకరిస్తున్నానని చెప్పి హెల్త్ ఇన్స్యూరెన్స్ పథకానికి రూ.10కోట్లను చేనేత దినోత్సవం రోజున విజయవాడలో చంద్రబాబు ప్రకటించారు. కానీ బడ్జెట్‌లో కేటాయింపులు జరగలేదు.
● చేనేతలపై పెనుభారంగా ఉన్న జీఎస్టీని రద్దు చేయించేందుకు కట్టుబడి ఉన్నామన్న ఆయన కేంద్రంతో చర్చిస్తామని చెప్పి మొండిచెయ్యి చూపించారు.
● ఎన్నికల ముందు చీరాల్లో హ్యాండ్ లూమ్ పార్కు ఏర్పాటు చేయించి చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు, వస్త్రాలకు మార్కెటింగ్ కల్పిస్తానని హామీ ఇచ్చారు. తీరా బడ్జెట్‌లో ఆ ఊసే లేదు.
● నేతన్న నేస్తం పథకానికి గత ప్రభుత్వం ఏడాది రూ.24వేలు కేటాయించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వఆ పథకం మాటే లేదు.
● నూలు సబ్సిడీ, స్థానిక మార్కెట్ అవకాశాలు పెంపొందించుకునేందుకు వినియోగదారులకు వస్త్ర కొనుగోలుపై ఇచ్చే 20శాతం రిబేట్ ఊసేలేదు.
కలగానే చేనేత సహకార సంఘాల ఎన్నికలు
2018 నుంచి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. అఫీషియల్ పర్సనల్ ఇన్‌చార్జిలతో నడిపిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించేంత వరకు సంఘ సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసి కార్మికులకు ఇబ్బంది లేకుండా పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సంఘ నాయకులు కోరుతున్నారు. చేనేతలకు నేరుగా లబ్ధిపొందే త్రిఫ్ట్ ఫండ్ పథకం, పరికరాల కొనుగోలు, నూలు సరఫరా సబ్సిడీ, ఉత్పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, చేనేతల రుణమాఫీ, పావలా వడ్డీ చెల్లింపులకు ప్రభుత్వ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి సవరణల ద్వారా కేటాయింపులు చేయాలని కోరుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బడ్జెట్‌లో కేటాయింపులు శూన్యం చేనేతలకు పూర్వ వైభవం తెస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన చంద్రబాబు పైసా విదల్చక పోవడంతో కార్మికుల్లో నిరాశ
న్యూస్‌రీల్
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
Comments
Please login to add a commentAdd a comment