ఆటో డ్రైవర్‌కు రెండేళ్ల జైలు శిక్ష
చీరాల రూరల్: ఆటోను అతివేగంగా.. అజాగ్రత్తగా నడిపి వ్యక్తి మరణానికి కారణమైన ఆటో డ్రైవర్‌కు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2,500 జరిమానా విధించారు. రెండో నిందితునిగా ఉన్న మరో వ్యక్తికి రూ.1,000 జరిమానా విధిస్తూ చీరాల అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు మంగళవారం తీర్పును వెలువరించినట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. వివరాలు.. ఈపురుపాలెం శివారు ఆటోనగర్ సమీపంలో 2018లో యండ్రపాటి సునీల్‌కుమార్ అనే వ్యక్తి తన ఆటోను అతివేగంగా అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడిపి మరో ఆటోను ఢీకొట్టాడు. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వెల్లినేని వెంకట వినోద్‌ఽకుమార్ మృతి చెందగా, పంచికట్ల జోగేశ్వరరావుకు గాయాలయ్యారు. అప్పటి రూరల్ సీఐ పి.భక్తవత్సలరెడ్డి కేసు నమోదుచేసి నిందితులను అరెస్టుచేశారు. అడిషనల్ పీపీ పద్మజ ప్రాసిక్యూషన్ తరఫున కోర్టులో వాదనలు వినిపించారు. కేసు పూర్వాపరాలను పూర్తిగా విచారించిన అసిస్టెంట్ సెషన్స్ జడ్జి న్యాయమూర్తి ఎం.సుధ.. వ్యక్తి మరణానికి కారణమైన మొదట ముద్దాయి యండ్రపాటి సునీల్‌కుమార్‌కు రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ.2,500 జరిమానా విధించారు. రెండో ముద్దాయి కంపా శరత్‌కు రూ.1,000 జరిమానా విధించారు. అప్పటి రూరల్ సీఐ పి.భక్తవత్సలరెడ్డి, కోర్టు లైజన్ యద్దనపూడి శ్రీను, కోర్టు హెడ్‌కానిస్టేబుల్ సీహెచ్ శ్రీనివాసరావు, హోంగార్డు డి.శ్రీనివాసరెడ్డిలను ఎస్పీ అభినందించారు.
రేంజ్‌లో 11 మందికి ఎస్‌ఐలుగా,
నలుగురికి ఏఎస్‌ఐలుగా ఉద్యోగోన్నతి
నగరంపాలెం: ప్రతిఒక్కరూ బాధ్యతతో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. గుంటూరు రేంజ్ పరిధిలోని పలు జిల్లాలకు చెందిన 11 మంది ఏఎస్‌ఐ (సివిల్)లకు ఎస్‌ఐ (సివిల్)లుగా, నలుగురు హెడ్ కానిస్టేబుళ్ల (ఏఆర్)కు ఏఎస్‌ఐ (ఏఆర్)లుగా ఉద్యోగోన్నతి కల్పించి, జిల్లాలు కేటాయించారు. ఈ మేరకు ఉద్యోగోన్నతి పొందిన ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు మంగళవారం గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులోని ఐజీ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎస్‌ఐలు ఎన్.శ్రీనివాసరెడ్డి తిరుపతి జిల్లాకు, వీఎన్ మల్లేశ్వరరావు, పి.ప్రమీల, ఆర్.కొండయ్య, డి.రాజ్యం, డి.శ్రీనివాసరావు, పి.సుబ్బారావు, బీ.శ్రీనివాసరావు, వై.రాజులు, ఎండి.అబ్దుల్‌హఫీజ్, షేక్.ఎన్.రసూల్‌ను గుంటూరు జిల్లాకు, ఏఆర్ ఏఎస్‌ఐలు పి.మోహన్‌రావు శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లా, షేక్.మస్తాన్, కె.శీను తిరుపతి జిల్లాకు, కె.శివకుమార్‌ను పల్నాడు జిల్లాకు కేటాయించారు.
రూ. 2,500 జరిమానా
వ్యక్తి మరణానికి కారణమైన
కేసులో కోర్టు తీర్పు
ఆటో డ్రైవర్‌కు రెండేళ్ల జైలు శిక్ష
Comments
Please login to add a commentAdd a comment