కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు
బాపట్ల: ఆహార పదార్థాలలో కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ట్రెయినర్ కలకండ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీపై మంగళవారం స్థానిక ఆహార భద్రత శిక్షణా కార్యాలయంలో హోటల్ వ్యాపారులకు ఆహార భద్రతపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రవీణ్‌కుమార్ మా ట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. లేనిపక్షంలో అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు. జిల్లా గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దేవరాజు మాట్లాడుతూ కల్తీ ఆహారం ద్వారా ఏ వ్యక్తికై నా ప్రాణహానీ జరిగితే రూ.10 లక్షల జరిమానా విధిస్తామని చెప్పారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రణీత్ మాట్లాడుతూ ఆ హార పదార్థాల అమ్మకాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో జాతీయ కన్స్యూమర్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ చదలవాడ హరిబాబు, బాపట్ల జిల్లా ఫాస్టాక్ మేనేజర్ నవీన్, స్థానిక ఫాస్టాక్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీ సర్స్ గోపి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment