రైల్వే సేవా పురస్కార్ అందజేత
లక్ష్మీపురం: సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని 69వ రైల్వే సేవా పురస్కార్ వేడుకలను ప్రతి ఏటా పండుగ వాతావరణంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని డివిజన్ డీఆర్‌ఎం ఎం.రామకృష్ణ అన్నారు. స్థానిక పట్టాభిపురంలోని రైల్వే డివిజన్ కార్యాలయంలో మంగళవారం 69వ రైల్వే వీక్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డులను 2024లో ప్రతిభ కనబరిచినందుకు అధికారి, ఉద్యోగులకు ఈ పురస్కారాలను అందజేయడం జరుగుతుందన్నారు. డివిజన్ పరిధిలోని 14 మంది అవార్డు గ్రహీతలుగా గుర్తించడం జరిగిందన్నారు. డివిజన్ అధికారి జి.రత్నం, గుంటూరు ఏడీఈఈ, ఎలక్ట్రిక్, మెయిన్ అధికారితో పాటు మరో 13 మంది వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ఉన్నారని తెలిపారు. అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం స్థాయిలో మూడు అవార్డులు, రైల్వే బోర్డు స్థాయిలో ఒక అవార్డును సాధించడంలో ప్రతి శాఖ అధికారి సిబ్బంది కృషి ఉందని వారందరిని అభినందించారు. అనంతరం రైల్వే సేవా పురస్కారాలను అందజేశారు. ఏడీఆర్‌ఎం సైమన్, సీనియర్ డీపీఓ షహబాజ్ హనూర్, సీనియర్ డీఈఎన్ కో–ఆర్డినేషన్ అనుషా, సీనియర్ డీఎంఈ మద్దాళి రవికిరణ్, సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్, డీసీఎం కమలాకర్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment