తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తి
అద్దంకి: శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి 70వ వార్షిక తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తయి నట్లు చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్‌నాయుడు అన్నారు. శింగరకొండలోని ఈఓ కార్యాలయంలో మంగళవారం రెండో సమన్వయ కమిటీ సమావేశాన్ని ఆర్డీఓ నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖల అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఆయా శాఖల ద్వారా చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. అత్యవసర సర్వీసులకు, అధికారులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశామని చెప్పారు. సత్రాలకు సంబంధించి అవసరమైన సరుకులు ముందుగానే తెచ్చి పెట్టుకోవాలన్నారు. తిరునాళ్ల రోజు ఆయా సత్రాల వద్దకు మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే వాహనాల ను అనుమతిస్తామని చెప్పారు. భక్తులు, సత్రా ల యజమానులు, దుకాణాల వారు, అధికారులు సమన్వయంతో పనిచేసి తిరునాళ్ల విజయవంతమయ్యేలా సహకరించాలని కోరారు.
పటిష్ట బందోబస్తు
తిరునాళ్లలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు డీఎస్పీ మొయిన్ చెప్పారు. ప్రభలపై ఒంటి గంట వరకు మాత్రమే సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి ఉందన్నారు. ఎక్కడైనా అశ్లీల కార్యక్రమాలు నిర్వహిస్తే కేసులు నమోదుతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశం ఈఓ తిమ్మనాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీడీవో సింగయ్య, తహసీల్దార్ శ్రీచరణ్, సీఐ సుబ్బరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు డ్రోన్ పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘా
Comments
Please login to add a commentAdd a comment