వర్సిటీ మహిళల బాల్ బాడ్మింటన్ పోటీలు ప్రారంభం
పాల్గొన్న ఐదు కళాశాలల జట్లు
నరసరావుపేట రూరల్: మహిళలు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ ప్రొఫెసర్ పీపీఎస్ పాల్‌కుమార్ తెలిపారు. వర్సిటీ అంతర కళాశాలల మహిళల బాల్ బాడ్మింటన్ పోటీలు కేసానుపల్లిలోని ఎంఏఎం ఫార్మసీ కళాశాలలో సోమవారం ప్రారంభమయ్యాయి. పోటీలో ఐదు జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పీపీఎస్ పాల్‌కుమార్, టైనీటాట్స్ స్కూల్ అధినేత పాతూరి కోటేశ్వరమ్మలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి విద్యార్థులు మొబైల్‌కు దూరంగా ఉంటూ ఆటలాడుతూ చదువులో కూడా ముందుండాలని సూచించారు. పోటీలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులతో వర్సిటీ జట్టును ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. కరైకుడిలోని అల్లప్ప యూనివర్సిటీలో నిర్వహించే ఆల్ ఇండియా అంతర వర్సిటీ పోటీల్లో వర్సిటీ జట్టు పాల్గొంటుందని తెలిపారు. పోటీలకు సెలక్షన్ కమిటీ సభ్యులుగా డాక్టర్ సిహెచ్ వెంకట్రావు, జె.ప్రేమ్‌కుమార్, ఇ.ఆదిబాబు, డాక్టర్ అరుణ సుజాతలు వ్యవహరించారు. కళాశాల చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు, డైరక్టర్ దరువూరి శ్రావ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రామారావు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
పారిశుద్ధ్య సేవలు ప్రైవేటుకు అప్పజెప్పొద్దు
కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ నేతలు, కార్మికుల ధర్నా
నరసరావుపేట: జీఓవెంటనే 279ని సత్వరం రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు పారిశుద్ధ్య సేవలు అప్పజెప్పే విధానాన్ని విడనాడాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరేకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ గతంలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. లేనిపక్షంలో ఈనెల 11న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి లక్షలాదిగా తరలివెళ్తామన్నారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఉప్పలపాటి రంగయ్య, వైదన వెంకట్, దాసరి రాజు, జయరాజు, వరహాలు, వందనం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వర్సిటీ మహిళల బాల్ బాడ్మింటన్ పోటీలు ప్రారంభం
వర్సిటీ మహిళల బాల్ బాడ్మింటన్ పోటీలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment