లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు
అద్దంకి: ఏ వైద్యశాలలోనైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో డాక్డర్ విజయమ్మ పేర్కొన్నారు. ఆమె మంగళవారం పట్టణంలోని గాజులపాలెం యూపీహెచ్‌సీ, కాకానిపాలెం యూపీహెచ్‌లను సందర్శించారు. ఆమె మాట్లాడుతూ ప్రైవేటు వైద్యశాలల్లో స్కానింగ్ క్వాలీటీ పెంచాలన్నారు. స్కానింగ్ సర్టిఫికెట్ రెన్యువల్‌ను సమయానికి విధిగా చేయించుకోవాలన్నారు. ఆశా కార్యకర్తల సమావేశంలో పాల్గొని విధులు బాధ్యతల గురించి వారికి వివరించారు. నిర్దేశించిన సర్వేలను, పనులను సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు. సీడీ అండ్ ఎన్‌సీడీ సర్వేను పరిశీలించారు. పట్టణంలోని మూడు ప్రైవేట్ వైద్యశాలల రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో గాజులపాలెం యూపీహెచ్‌సీ వైద్యాధికారి డాక్డర్ జయసింహా, కాకానిపాలెం వైద్యాధికారి హేమామాధవి, ఎంపీహెచ్‌ఈవో ఏ నాగేశ్వరరావు, సూపర్‌వైజర్ వీ వెంకాయమ్మ, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వో విజయమ్మ
Comments
Please login to add a commentAdd a comment