విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత ఎస్వీఆర్‌ఎం కళాశాలదే
నగరం: తీరప్రాంతంలో ఎంతో మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత శ్రీవెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలదేనని రాష్ట్ర రెవెన్యూ ఽశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. స్థానిక ఎస్వీఆర్‌ఎం కళాశాల వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి అనగాని పాల్గొని మాట్లాడారు. 1969లో వెలగపూడి రామకృష్ణ నగరంలో కళాశాలను స్థాపించారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కళాశాలలో విలువలతో కూడిన విద్యను అందింస్తున్నట్లు తెలిపారు. కళాశాలలో విద్యను అభ్యసించిన ఎంతో మంది ఉన్నత స్థానాలలో ఉన్నారన్నారు. కళాశాల సేవలను ఈ ప్రాంతంలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వల్లభనేని బుచ్చియ్యచౌదరి, ప్రిన్సిపాల్ హరికృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment