రూ.2 కోట్ల నిధులు వృథా
వేటపాలెం: గ్రామీణ క్రీడాకారులకు నిరంతరం శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహించడానికి ఏడేళ్ల కిందట రూ.2 కోట్ల నిధులతో నిర్మించిన కేంద్రం ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా ఉండిపోయింది. దీనికి ఖర్చు చేసిన రూ.2 కోట్లు వృథాగా మిగిలిపోయాయని క్రీడాకారులు విమర్శిస్తున్నారు. 2017 మార్చిలో పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో స్టేడియం ఏర్పాటుకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. అప్పట్లో దీని నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులు కేటాయించారు. ఆ నిధులతో ఇండోర్ స్టేడియం నిర్మించారు. అప్పట్లో పనులు వేగవంతంగా సాగాయి. తరువాత పనులు నిలిచిపోయాయి. షటిల్ బ్యాడ్మింటన్ కోర్టుతోపాటుగా క్రీడాకారుల కోసం ప్రత్యేక గదులు, ప్రేక్షకుల కోసం గ్యాలరీ ఏర్పాటు చేయాల్సి ఉంది. మరుగుదొడ్లు నిర్మించి వదిలేశారు. ఇంకా సగానికి పైగా పనులు మిగిలి ఉన్నాయి. క్రీడా వికాస కేంద్రం నిర్మాణం పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు గడిచినా దాన్ని ఇంతవరకు పూర్తి చేయకపోవడంపై క్రీడాకారులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు దీనిపై దృష్టి సారించి అసంపూర్తిగా ఉన్న క్రీడా ప్రాంగణ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకు రావాలని క్రీడాకారులు కోరుతున్నారు.
అసంపూర్తిగా క్రీడా వికాస కేంద్రం దుస్థితి ఏడేళ్లుగా ప్రారంభానికి నోచుకోని దుస్థితి పట్టించుకోని పాలకులు, అధికారులు
Comments
Please login to add a commentAdd a comment