ప్రతి సాలుకు ప్రత్యేకంగా అమర్చిన డ్రిప్ పద్ధతి ద్వారా నీటి సరఫరాతో పాటు వీరు స్వయంగా గోమూత్రం, ఆవు పేడ, ఆవుపాలు, ఆవు పెరుగు, నెయ్యి తదితర పదార్థాలతో తయారు చేసిన ద్రవ, ఘన జీవామృతాలు, పంచగవ్య తదితర కషాయాలను డ్రిప్ ద్వారా మొక్కలకు సరఫరా చేయడంతో ప్రతి పంట పెరిగి పచ్చదనం, పర్యావరణానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. సిబ్బంది మండల టీం లీడర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో వీరు పండించిన కూరగాయలు ఆకుకూరలను ప్రస్తుతం బొల్లాపల్లి, కోలాలపూడి, దర్శి గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు కోనంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే సరఫరా చేయటం గమనార్హం. ప్రతి సోమవారం మండల రెవెన్యూ కార్యాలయం వద్ద సిబ్బంది స్వయంగా స్టాల్ ఏర్పాటు చేసి స్థానికులకు, ఉద్యోగులకు తాము పండించిన కూరగాయలు విక్రయిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. బొల్లాపల్లికి చెందిన గృహిణి అడ్డగడ సుజాతను వీరు అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ తమ ఇంటి ముందు పెరట్లో 16 రకాల ఆకుకూరలు, కూరగాయలతో కూడిన న్యూట్రి గార్డెన్ గ్రామస్తులకు ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం ప్రకృతిలో లభించే పదార్థాలతో వీరు తయారు చేసిన ఘన, ద్రవ జీవామృతాలు, పుల్లటి మజ్జిగ, కోడిగుడ్డు, నిమ్మరసం, తదితర పదార్థాలతో ప్రకృతి సేద్యాన్ని రైతులతో పాటు స్థానిక మహిళలకు అవగాహన కల్పిస్తున్న సిబ్బంది శివశంకర్, రెహమాన్ బి, వైష్ణవి, శ్రీనివాసరావు, రాజేశ్వరి,శశికళ లను రైతులు రైతు సంఘం నాయకులు అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment